అమ్మలగన్న అమ్మ

ఒక రైతే ముద్దు  ఇద్దరికి మించి వద్దని వర్థమానదేశాలు సంతానం విషయంలో ఆంక్షలు పెడుతుంటే దేవుడిచ్చిన బిడ్డలను ఎలా వద్దంటాం అంటూ ఫ్లారిడాకు చెందిన లైట్ రెబెక్ 16 మంది పిల్లలను కని అందరితో ఔరా అనిపించింది. వాళ్ళంతా 2 నుంచి 23 సంవత్సరాల లోపు వయసున్నవారు. ఇంతమందికి ఎలా చాకిరీ చేస్తోందో? అని ఆశ్చర్యపోవడం ఈ వార్త విన్న వారి వంతవుతోంది. పిల్లల సంఖ్య కాస్త ఎక్కువ కావడంతో ఎవరి పేరేమిటో చటుక్కున గుర్తుకురాక కన్‌ఫ్యూజ్ […]

ఒక రైతే ముద్దు  ఇద్దరికి మించి వద్దని వర్థమానదేశాలు సంతానం విషయంలో ఆంక్షలు పెడుతుంటే దేవుడిచ్చిన బిడ్డలను ఎలా వద్దంటాం అంటూ ఫ్లారిడాకు చెందిన లైట్ రెబెక్ 16 మంది పిల్లలను కని అందరితో ఔరా అనిపించింది. వాళ్ళంతా 2 నుంచి 23 సంవత్సరాల లోపు వయసున్నవారు. ఇంతమందికి ఎలా చాకిరీ చేస్తోందో? అని ఆశ్చర్యపోవడం ఈ వార్త విన్న వారి వంతవుతోంది. పిల్లల సంఖ్య కాస్త ఎక్కువ కావడంతో ఎవరి పేరేమిటో చటుక్కున గుర్తుకురాక కన్‌ఫ్యూజ్ అవుతుంటాను అంటోంది రెబక్. ఏ రోజు కారోజు చేయాల్సిన పనుల లిస్ట్ తయారుచేసుకుంటాను.

లేకపోతే ఇంతమంది అవసరాలు గుర్తుపెట్టుకుని ఎలా పనిచేసేది? అంటుంది ఆయాసపడుతూ..! పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి అందరితోనూ ఆటలాడిస్తున్నాను. ఎవరే ఆట ఆడాలో నిర్ణయించి ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతను మా ఆయనకు అప్పజెప్పాను. ఆయన వారం మొత్తం మీద 88 రకాల ఆటలలో శిక్షణ ఇస్తున్నాడు. అందరం కలిసి బైటికి పోడానికి కార్లేం చాలతాయి..అందుకే ఒక బస్సు కొనుక్కున్నాం అని చెప్పింది రెబక్. వారంలో 42సార్లు వాషింగ్ మెషిన్‌వేసి బట్టలు ఉతుక్కుంటారు. లాండ్రీ పనులలో, వంట పనులలో పిల్లలు అమ్మకు సాయం చేస్తుంటారు. నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కుటుంబం ఉండాలనే కోరిక ఉండేది. భగవంతుడి దయవల్ల అది తీరింది. ఇంత పెద్ద సంసారమా అని మా ఆయన    ఏనాడూ విసుక్కోలేదు. మరీ విచిత్రమేమిటంటే అనాథ పిల్లలకు సేవ చేసేందుకు ఒక చారిటీ సంస్థను కూడా నడుపుతోంది.

Comments

comments