భవిష్యత్ టిడిపిదే : రేవూరి

మనతెలంగాణ/ఎన్‌జిఒఎస్‌కాలని : తెలంగాణ ఉద్యమం 1952లో మొదలైందని ఆనాడు చార్మినార్ సాక్షిగా ఉద్యమం మొదలై ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సిద్ధించిందని కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాలేదని కెసిఆర్‌కు నిబద్ధత తక్కువని ఉపన్యాసాలకు పనికి వస్తాడని టిడిపి పొ లీట్ బ్యూరో సభ్యుడు నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. టిడిపిని రాష్ట్రంలో లేకుండా చేయడానికి కెసిఆర్ ఎన్నో కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు. టిడిపి ప్రజల పార్టీ అని దీనికి ప్రజలే […]

మనతెలంగాణ/ఎన్‌జిఒఎస్‌కాలని : తెలంగాణ ఉద్యమం 1952లో మొదలైందని ఆనాడు చార్మినార్ సాక్షిగా ఉద్యమం మొదలై ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సిద్ధించిందని కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాలేదని కెసిఆర్‌కు నిబద్ధత తక్కువని ఉపన్యాసాలకు పనికి వస్తాడని టిడిపి పొ లీట్ బ్యూరో సభ్యుడు నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. టిడిపిని రాష్ట్రంలో లేకుండా చేయడానికి కెసిఆర్ ఎన్నో కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు. టిడిపి ప్రజల పార్టీ అని దీనికి ప్రజలే రక్షకులని ఆయన అన్నారు. టిడిపి చేసిన అభివృద్ధే తెలంగాణలో ఉందని ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి ఏంటో అని ప్రజలందరికి తెలుసన్నారు. టిడిపి సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ అని, రాజకీయ కుటుంబం నుంచి సంబంధం లేకుండా వచ్చిన అనేక మంది జాతీయస్థాయి నాయకులను చేసిన పార్టీ టిడిపి అని అన్నారు. రానున్నా రోజుల్లో రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలుస్తుందన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేషం మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదని విమర్శించారు. టిడిపి నుంచి ఎంతో మంది నాయకులు పోయిన రాష్ట్రంలో బలమైన కార్యకర్తల అండ ఉన్నా పార్టీ టిడిపి పార్టీ ఒక్కటే అన్నారు.1200 మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో 4700 పాఠశాలలు, 22000 పరిశ్రమలు మూత పడ్డాయని దీనికి కారణం టిఆర్‌ఎస్ అసమర్థతే అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వతంత్రంగా బతుకు లేకుండా కెసిఆర్ చేసిండని, కాని టిడిపి ఆత్మ గౌరవంతో బతికేలా కృషి చేస్తుందన్నారు. ఓట్ల కోసమే రైతు బంధు పథకం పెట్టాడని  విమర్శించారు. గిట్టు బాటు ధర చెల్లించమంటే రైతులపై కేసులు పెట్టిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యలు టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు గరిక పాటి మోహన్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో టిడిపి బలంగా ఉందని రాబోయే ఎన్నికల్లో టిడిపికి మెజారీటి సీట్లు వస్తాయని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం పుట్టిన టిడిపి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. ఎన్‌టిఆర్, చంద్రబాబు నాయుడి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సమిష్టి గా కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ది రెడ్డి, మూడు రాష్ట్రాల పార్టీ అధికార ప్రతినిధి కాశినాధ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పుల్లయ్య, రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శులు ప్రసాద్‌బాబు, రాజునాయక్, రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస చారి, ఇందిర, పుల్లూరి అశోక్, రవీందర్, కుమార స్వామి, కక్కె సారయ్య, కార్యకర్తలు, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Related Stories: