‘హస్త’రేఖ వంకర

చర్చానీయాంశంగా మారిన రేవంత్ వాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్‌లో గుసగుసలు ఎవరెటువైపో తేల్చుకోలేక గందరగోళపడుతున్న క్యాడర్ జిల్లాస్థాయి నేతల్లోనూ మథనం మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెస్తారనుకునే అధినేతల తీరు క్యాడర్‌ను గందరగోళంలో పడేస్తోంది. అధినేత అభిప్రాయ భేదాలు బహిర్గతమవ్వడంతో జిల్లా స్థాయి నేతలలోనూ మథనం మొదలైంది. ఎవరు ఎటువైపో తేల్చుకోలేని స్థితిలోకి ద్వితీయశ్రేణి నెట్టబడుతోంది. మారిన రాజకీయ సమీకరణలల్లో భాగంగా కాంగ్రెస్‌లోకి బలమైన శక్తిగా పేరున్న నాయకత్వం చేరిన విషయం […]

చర్చానీయాంశంగా మారిన రేవంత్ వాఖ్యలు

ఓరుగల్లు కాంగ్రెస్‌లో గుసగుసలు

ఎవరెటువైపో తేల్చుకోలేక గందరగోళపడుతున్న క్యాడర్

జిల్లాస్థాయి నేతల్లోనూ మథనం

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెస్తారనుకునే అధినేతల తీరు క్యాడర్‌ను గందరగోళంలో పడేస్తోంది. అధినేత అభిప్రాయ భేదాలు బహిర్గతమవ్వడంతో జిల్లా స్థాయి నేతలలోనూ మథనం మొదలైంది. ఎవరు ఎటువైపో తేల్చుకోలేని స్థితిలోకి ద్వితీయశ్రేణి నెట్టబడుతోంది. మారిన రాజకీయ సమీకరణలల్లో భాగంగా కాంగ్రెస్‌లోకి బలమైన శక్తిగా పేరున్న నాయకత్వం చేరిన విషయం విదితమే. గత కొంత కాలంగా పాత, కొత్త నేతలంతా కలిసి గులాబీ పార్టీని ఎదుర్కొనే శక్తిగా అవతరించేందుకు కృషి మొదలుపెట్టారు. ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా బస్సు యాత్రలు, సభలు, సమావేశాలతో పర్యటనలు చేశారు. ఇవన్నీ ఓరుగల్లులో సైతం ప్రజలను ప్రభావితం చేసేవిగానే ఉన్నాయనడంలో సందేహం లేదు. పాత, కొత్త నేతలంతా క్యాడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపి ప్రజలలో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెంచుతున్నారని భావించే క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్ర నేతల రేవంత్‌రెడ్డి స్వంత గూటిపై చేసిన వాఖ్యాలు ఓరుగల్లులో దుమారం లేపాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పట్ల రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యాలు ద్వితీయ శ్రేణి క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టిందని, జిల్లా స్థాయి నేతలలోనూ మధనం మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్న నేతలు మాజీ ఎమ్మెల్యేలు, వేం నరేందర్‌రెడ్డి, సీతక్కతో పాటు తదితరులు కాంగ్రెస్‌లో చేరడం ఉమ్మిడి జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతల గుర్తింపుకు కత్తెరపడే అవకాశాలున్నాని, ఇట్టి విషయంలో జిల్లా స్థాయి సీనియర్‌లు, సీట్లు ఆశించే ఆశాహులు సైతం కాస్త ఇబ్బందిపడ్డారని అప్పట్లో గుసగుసలు కూడా వినిపించిన విషయం గమనార్హం. అయితే ద్వితీయ శ్రేణి క్యాడర్ సైతం నమ్ముకున్న నేతలతోనే ఎక్కువ భాగం కాంగ్రెస్‌లో చేరడం, తమ బలాన్ని నిరూపించింది. కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన వారు సైతం పాత నేతలు, సీనియర్లతో మమేకమవ్వడంతో పరిస్థితులు సర్థుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టిపిసిసి అధ్యక్షుడు ఇతర నేతలు నిర్వహించిన బస్సుయాత్ర సైతం కాంగ్రెస్ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపింది. పాత, కొత్త అనే తేడా లేకుండా జనంలో ఐక్యతనూ ప్రదర్శించారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలతో కథ మొదటికొచ్చినట్లైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓరుగల్లు క్యాడర్‌లో సైతం గ్రూప్‌లున్నాయని, అభిప్రాయ బేధాలున్నాయని ఇప్పటికే ప్రజలలో ఓ ముద్రపడి ఉండటం గమనార్హం. కొత్తగా కాంగ్రెస్‌లోకి చేరి నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్న వారంతా రేవంత్‌రెడ్డి అనుచరులుగా ముద్రపడటం, అప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్లుగా కొనసాగుతున్న వారంతా ఉత్తమ్ డైరెక్షన్‌లో ఉన్నారనే వాదనలుండటం గమనార్హం. దీంతో రానున్న ఎన్నికలలో సీట్ల కేటాయింపులో అధిస్ఠానం ఎ వరిని ఎంతమేరకు పరిగణలోకి తీసుకుంటుందోననే మీమాంసలో కూడా  క్యాడర్‌తో పాటు జిల్లా స్థాయి నేతలలోనూ అంతఃర్మథనం ఉన్నట్లుగా రాజకీయచర్చలు కొనసాగాయి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యాలతో తమ వర్గాన్ని విస్మరిస్తే అధిస్టానాన్ని సైతం ఎదురించక తప్పదనే సంకేతాలు పంపారనడంలో సందేహం లేదు. ఏదిఏమైనప్పటికీ రేవంత్ వాఖ్యాలు ఓరుగల్లు కాంగ్రెస్ క్యాడర్‌లో అంతఃర్మధనం మొదలైంది. రానున్న కాలంలో ఎటువైపు ఏ నేతల వైపు ఉం డాలో తెలియని ఆయోమయస్థితిలోకి నెట్టబడినట్లైందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్లలోనూ రహాస్యపు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో చోటు చేసుకునే పరిణామాలు అనివార్యంగా గులాబీ పార్టీకీ అనుకూలంగా మారడం తప్పదని, కాంగ్రెస్ ఆశాహులకు సైతం అనుకూలంగా మారే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం.

Comments

comments

Related Stories: