ఇందిరమ్మ ఇళ్లపై విజి‘లెన్స్’

విచారణకు సిద్ధమవుతున్న సర్కార్ ఉమ్మడి జిల్లాలో భారీగా అవినీతి సిఐడి దర్యాప్తు నివేదికపై రీకాల్ అప్పటి అధికార నేతలే టార్గెట్ మనతెలంగాణ/ ఆదిలాబాద్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అక్రమ వ్యవహారంపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరోసారి విచారణకు తెర లేపబోతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ అక్రమాలపై సిఐడి విచారణ జరగడం సంబంధిత హౌసింగ్ అధికారులపై […]

విచారణకు సిద్ధమవుతున్న సర్కార్
ఉమ్మడి జిల్లాలో భారీగా అవినీతి
సిఐడి దర్యాప్తు నివేదికపై రీకాల్
అప్పటి అధికార నేతలే టార్గెట్

మనతెలంగాణ/ ఆదిలాబాద్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అక్రమ వ్యవహారంపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరోసారి విచారణకు తెర లేపబోతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ అక్రమాలపై సిఐడి విచారణ జరగడం సంబంధిత హౌసింగ్ అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగినప్పటికీ మళ్లీ తెలంగాణ ప్రభుత్వం దీనిపై లోతైన విచారణ జరిపేందుకు నడుం బిగించ బోతుండడం దూమారం రేపుతోంది. మరోసారి పూర్తి స్థాయిలో విజిలెన్స్ విభాగం చేత క్షేత్ర స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే బుధవారం జిల్లా అధికారులకు ఇందిరమ్మ పాత దస్త్రాలకు సంబంధించిన ఫైళ్లను సిద్దం చేయాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అయితే అప్పటి కాంగ్రెస్ హయాం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యవహారంలో కోట్లాది రూపాయల అవినీతి చోటు చేసుకుంది. ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేశారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో సంబంధిత హౌసింగ్ అధికారులతో పాటు అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కొంతమంది రాజకీయ నాయకులు ఈ అవకతవకల్లో భాగస్వామ్యులుగా ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. అయినప్పటికీ వారి మీద చర్యలు తీసుకోకుండా అధికారులనే బలి పశువులను చేశారు. అయితే సీఐడీ విభాగం పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పటికీ నివేదికలన్ని దాదాపుగా బుట్ట దాఖలయ్యాయని చెప్పవచ్చు. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి తీసుకొని వస్తుండడంతో అప్పటి అధికార పార్టీ నేతలు హడలెత్తి పోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మంది నాయకులు ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతుండడం గమనార్హం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లయితే ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న నేతల పరిస్థితి ఏంటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Comments

comments

Related Stories: