కాంగ్రెస్ కార్పోరేటర్ల ధర్నా..

రాజీవ్ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా..? సర్వీస్ రోడ్లు బాగు చేయించడంలో ఎందుకు నిర్లక్షం..! మనతెలంగాణ/జ్యోతినగర్: రామగుండం మున్సిపల్ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు రాజీవ్ రహదారి ఇరువైపుల సర్వీస్ రోడ్లు లేక అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, వీటిని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్‌కార్పోరేటర్లు ధర్నా చేపట్టారు. స్థానిక ఎఫ్‌సిఐ క్రాస్‌రోడ్డు రాజీవ్ రహదారిపై కార్పోరేటర్లు కొలిపాక సుజాత-మల్లయ్య, మహాంకాళి స్వామిలు ధర్నా జరిపిన అనంతరం స్థానిక […]

రాజీవ్ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా..?
సర్వీస్ రోడ్లు బాగు చేయించడంలో ఎందుకు నిర్లక్షం..!
మనతెలంగాణ/జ్యోతినగర్: రామగుండం మున్సిపల్ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు రాజీవ్ రహదారి ఇరువైపుల సర్వీస్ రోడ్లు లేక అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, వీటిని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్‌కార్పోరేటర్లు ధర్నా చేపట్టారు. స్థానిక ఎఫ్‌సిఐ క్రాస్‌రోడ్డు రాజీవ్ రహదారిపై కార్పోరేటర్లు కొలిపాక సుజాత-మల్లయ్య, మహాంకాళి స్వామిలు ధర్నా జరిపిన అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రాజీవ్ రహదారి ఇరువైపుల సర్వీస్ రోడ్లు లేకపోవడంతో రోజు అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, మున్సిపల్ కార్యాలయం నుండి రామగుండం బి పవర్‌హౌజ్ వరకు గల సర్వీస్ రోడ్లను రెండు సంవత్సరాల క్రితం మిషన్ భగీరధ పైపులైన్ల కోసం తవ్వకాలు జరిపి వదిలారని, మళ్లి వాటిని బాగుచేయక నిర్లక్షంగా వదిలివేసారని అన్నారు. సర్వీస్ రోడ్లను నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు జిల్లా కలెక్టర్‌తో పాటు అనేక మంది ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసిన నిర్లక్షం వహిస్తున్నారని అన్నారు.

పైప్‌లైన్ పనులు పూర్తయిన ఇప్పటి వరకు సర్వీస్ రోడ్లను మల్లి బాగు చేయించకపోవడంతో వాహనదారులు అనేక మంది ప్రదాన రోడ్లపైనే వెళ్తు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రాజీవ్ రహదారి నాలుగు లైన్ల పనులు పూర్తయి ఏండ్లు గడుస్తున్న ఇప్పటి వరకు సర్వీస్‌రోడ్లను రెండు వైపుల పూర్తిగా చేపట్టలేకపోయారని అన్నారు. ఎఫ్‌సిఐ క్రాస్ రోడ్డు నుండి మేడిపల్లి రోడ్, కవితా ధియేటర్ నుండి బస్టాండ్ ఏరియా వరకు సర్వీస్ రోడ్ల కోసం భూమిని సేకరించకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జిల్లాల విభజనతో పాలన సౌలభ్యంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన సర్వీస్ రోడ్ల విషయంలో ఏ మాత్రం పట్టించుకోకపోవడం, సర్వీస్ రోడ్లకోసం సేకరించిన భూములను వివాదస్పదంగా ఉండడంతో రెవెన్యూశాఖ అధికారులు, ఆర్‌అండ్‌బి అధికారులు జోక్యం చేసుకొని వాటిని పట్టించుకోకపోవడంతో ప్రయాణీకులకు దినదినగండంగా మారుతుందని కాంగ్రెస్ కార్పోరేటర్లు ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ ప్రతినిధులు వైఫల్యం చెందుతున్నారని అన్నారు.

ఇప్పటికైనా రాజీవ్ రహదారి ఇరువైపుల సర్వీస్ రోడ్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. వీటితో పాటు మున్సిపల్ కార్యాలయం నుండి 5ఇంక్లైన్‌కు వెళ్లే రోడ్డు లేబర్ కోర్టు వద్ద గుంతలుగా తవ్వి వదిలేయడంతో ఇటీవలే ఒక వృద్దుడు ద్విచక్ర వాహనంపై వెళుతు గుంతలు కనపడక అందులో పడి మృతి చెందాడని పేర్కొన్నారు. సుమారు అరగంట పాటు కాంగ్రెస్ కార్పోరేటర్లు ధర్నా చేపట్టగా, ఎన్టీపీసీ పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు బొంతల రాజేష్, కొలని కవితా వెంకటరెడ్డి, వెంగళ పద్మ-బాపు, బొమ్మక శైలజ-రాజేష్, పెద్దెల్లిప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి, పీచర్ల శ్రీనివాస్, నాయకులు జక్కుల దామోదర్, తిప్పారపు శ్రీనివాస్, యండి. ముస్తాఫ, రవియాదవ్, గట్ల రమేష్, యంచర్ల మహేష్, గోపగాని సతీష్, ముష్కె శ్రీనివాస్, యండి రహీం, మామిడి సురేష్, ప్రశాంత్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Related Stories: