బిహార్‌లో ఘోర ప్రమాదం : 27 మంది సజీవదహనం

పాట్నా : బిహార్‌లో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 27 మంది చనిపోయారు. మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి అక్కడే అంబులెన్సుల్లో ప్రాథమిక చికిత్స […]

పాట్నా : బిహార్‌లో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 27 మంది చనిపోయారు. మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి అక్కడే అంబులెన్సుల్లో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

Bus Roll Over in Bihar : 27 People died

Related Stories: