‘మా’తో ముగిసిన తలసాని భేటీ…

హైదరాబాద్: సినీ పరిశ్రమని కుదిపేస్తున్నకాస్టింగ్ కౌచ్ వివాదంపై తెలంగాణ సర్కార్ చోరువ చూపుతూ శనివారం సినీ ప్రముఖులతో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహిళలు, నటులకు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి తలసాని సూచించారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. ఒక సినిమా నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, సమన్వయకర్తలు […]

హైదరాబాద్: సినీ పరిశ్రమని కుదిపేస్తున్నకాస్టింగ్ కౌచ్ వివాదంపై తెలంగాణ సర్కార్ చోరువ చూపుతూ శనివారం సినీ ప్రముఖులతో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహిళలు, నటులకు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి తలసాని సూచించారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. ఒక సినిమా నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, సమన్వయకర్తలు లేకుండా చేస్తామని మంత్రి ఆర్టిస్టులకి హామీ ఇచ్చారు. నటినటులకు మేనేజర్ ద్వారానే నేరుగా బ్యాంకు ఖాతాలో చెల్లింపులు చేస్తామన్నారు. మహిళల వేధింపులు, లైంగిక దాడుల జరిపేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.  ఫిర్యాదుల కోసం ఎఫ్ డిసిలో ప్రత్యేక సెల్ నంబర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా నటన శిక్షణా కేంద్రాలను ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని పరిశ్రమను, మీడియాను మంత్రి కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మా సభ్యులకు, మీడియాకు మంత్రి పేర్కొన్నారు.

Related Stories: