తెలంగాణ రైతులకు ఉజ్వల భవిష్యత్

గ్రంథాలయ పుస్తకాలను ప్రతి ఒక్కరు చదవాలి బంగారు తెలంగాణ చేయడమే కేసిఆర్ లక్షం కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది ఏమి లేదు మంత్రి చందూలాల్ మన తెలంగాణ/ములుగు : మండలంలో గురువారం గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ములుగు లీలా గార్డెన్ లో రైతు సమన్వయ సమితి శిక్షణ కేంద్రంలో పాల్గొన్నారు. అనంతరం ములుగు మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సబ్సిడీ […]

గ్రంథాలయ పుస్తకాలను ప్రతి ఒక్కరు చదవాలి
బంగారు తెలంగాణ చేయడమే కేసిఆర్ లక్షం
కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది ఏమి లేదు మంత్రి చందూలాల్

మన తెలంగాణ/ములుగు : మండలంలో గురువారం గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ములుగు లీలా గార్డెన్ లో రైతు సమన్వయ సమితి శిక్షణ కేంద్రంలో పాల్గొన్నారు. అనంతరం ములుగు మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేసారు. మండలంలో జాకారం గ్రామంలో 24.90 లక్షల సిసిరోడ్లను ప్రారఁభించారు.  గ్రామస్థులు గ్రామంలో ఉన్న పలు సమస్యలపై మంత్రికి మెమొరాండం సమర్పించారు. అనంతరం సాయిబాబా టెంపుల్ దగ్గర వద్ద 8.99 లక్షలసిసి రోడ్లను ప్రారంభించారు.

ములుగు పట్టణంలో గల గ్రంథాలయాన్ని పది లక్షల నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఆయ న తెలిపారు. సిబ్బందికి 010 ప్రకా రం జీతాలు అమలు చేయా లని  మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి రూ. 5 లక్షల వ్యయంతో నూతన భవనం నిర్మించుకోమని వెంటనే నిధులు మంజూరి చేస్తామని తెలిపి సిబ్బందికి సంబంధిత శాఖతో మాట్లాడి జీతాలు పెంచే ప్రక్రియను మొదలు పెడుతానని తెలిపారు. అనంతరం లీలా గార్డెన్ లో ఏర్పాటుచేసిన రైతు సమన్వయ సమితి శిక్షణ తరగతులను హాజరై మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశ్యం రైతునే రాజుగా చూడాలని రైతు కష్టాలు పడకూడదని 7 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు రాత్రింబవళ్లు నిద్రలేక కరెంట్ షాక్‌తో, పాముకాటుతో రైతులు మృత్యవాత పడ్డారని రైతు ఏ సమయంలోనైనా పోయి వ్యవసాయ బావులవ ద్ద నీరు పారించుకొనుటకు వీలుగా 24 గంటల కరెంట్ ప్రవేశపెట్టారన్నారు. రైతు బందు పథకం క్రింద ఏకరానికి 4 వేలు చొప్పున మే 10 వ తేదీ నుండి రైతుల అకౌంట్ లో జమయ్యే విధంగా పేరు చెక్కు మంజూరి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ములుగు మార్కెట్ యార్డులో రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేసారు. నియోజక వర్గంలో ఎనబై ట్రాక్టర్లు మంజూరయ్యాయని ఒక్కొ ట్రాక్టర్ కు 50 శాతం ప్రభుత్వం సబ్సిడి ఇస్తుందని , 50 శాతం వాటాని రైతు భరించి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రైతులకు సూచించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ డాక్టర్ ఆజ్మీరా ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ పల్లా బుచ్చయ్య, జడ్పీ ప్లోర్ లీడర్ సకినాల శోభన్, ఎంపిపి భూక్యా మంజుల మురళి, కిషన్ నాయక్, కుటుంబరావు, జిల్లా వ్యవసాయఅధికారి అనురాధ, శ్రీనివాస్, గండ్రత్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments