పెరిగిన పసిడి ధర..

హైదరాబాద్: పసిడి ధర వరుసగా మూడో రోజు కూడా పెరిగింది. అంతర్జాతీయంగా  బలమైన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా పెరగడంతో బంగారం ధర మరింతగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు బాగా పెరిగాయి. నిన్నటి అక్షయ తృతీయ ప్రభావమూ బంగారం ధరపై పడింది. నేటి బుటియన్ మార్కెట్లో పడి గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.32,630 చేరింది. ఇదే బాటలో వెండి ధర కూడా బాగా […]


హైదరాబాద్: పసిడి ధర వరుసగా మూడో రోజు కూడా పెరిగింది. అంతర్జాతీయంగా  బలమైన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా పెరగడంతో బంగారం ధర మరింతగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు బాగా పెరిగాయి. నిన్నటి అక్షయ తృతీయ ప్రభావమూ బంగారం ధరపై పడింది. నేటి బుటియన్ మార్కెట్లో పడి గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.32,630 చేరింది.
ఇదే బాటలో వెండి ధర కూడా బాగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,030 పెరిగి రూ.41,480కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి వెండికి డిమాండ్ బాగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పెరిగింది.