అయ్యబాబోయ్ ఆవిడ ఫోన్..

      హలో… చెప్పు బంగారం., ఏంటి కాల్ చేశావ్… ?’ ఎందుకు ఫోన్ తియ్యలేదు రెండు సార్లు చేస్తే… మీటింగ్ లో ఉన్నాన్లే..’ నేను ఫోన్ చేస్తేనే మీకు ఎక్కడలేని మీటింగులు.. అలా ఏదైనా అర్జంట్ అయితే వాట్సప్ మెసేజ్ పంపొచ్చుగా బంగారం….. మెసేజ్ లోనే కుటుంబాన్ని నడుపుకుందాం.. వదిలెయ్ రా… ఇప్పుడు చేశానుగా చెప్పు… ఇప్పుడైనా ఫ్రీనా… ఫ్రీగానే ఉన్నా చెప్పు… డికాషన్‌పెట్టాలని కిచెన్‌లోకి వెళ్ళా. కాఫీపొడి డబ్బా దొరికితేనా… ఆ డబ్బా […]

 

 

 

హలో…
చెప్పు బంగారం., ఏంటి కాల్ చేశావ్… ?’
ఎందుకు ఫోన్ తియ్యలేదు రెండు సార్లు చేస్తే…
మీటింగ్ లో ఉన్నాన్లే..’

నేను ఫోన్ చేస్తేనే మీకు ఎక్కడలేని మీటింగులు..
అలా ఏదైనా అర్జంట్ అయితే వాట్సప్ మెసేజ్ పంపొచ్చుగా బంగారం….. మెసేజ్ లోనే కుటుంబాన్ని నడుపుకుందాం..
వదిలెయ్ రా… ఇప్పుడు చేశానుగా చెప్పు…
ఇప్పుడైనా ఫ్రీనా… ఫ్రీగానే ఉన్నా చెప్పు…
డికాషన్‌పెట్టాలని కిచెన్‌లోకి వెళ్ళా. కాఫీపొడి డబ్బా దొరికితేనా…
ఆ డబ్బా ఇక్కడకి తీసుకురాలేదే..
మీరు తీసుకెళ్ళారని ఎవరు అన్నారు… ఒక నిమిషం పెళ్ళాంతో మాట్లాడటానికి తీరదు గానీ మిగతా వాళ్ళతో అయితే గంటల తరబడి మాట్లాడుతారు.. చుట్టుపక్కల వారిని చూసి నేర్చుకోండి ఎలా ఉంటున్నారో..
సరే..చావగొట్టకు..
ఇలా మధ్య మధ్యలో
జొరబడితే ఎలా..?
సరే..యూ క్యారీ ఆన్..
ఛీ ఇప్పుడు క్యారీయేంటి
నా ఉద్దేశం అదికాదే బాబు..

ఏదో చెప్తున్నాను ఏంటది..
కాఫీ పొడి.. ఆ.. కాఫీ పొడి డబ్బా తీసి పైన ఎక్కడో పెట్టారు. అందుకోబోతుంటే ఆపరేషన్ అయిన కాలు కొద్దిగా నొప్పి అనిపించింది. ఎందుకైనా మంచిది వేరే డాక్టర్ కి చూపిద్దామా.. అని అడుగుదామని.. ఇందుకే ఫోన్ చేశావా…
ఆపరేషన్ రోజు నన్ను హాస్పిటల్‌లో వదిలి పారేసి ఆఫీస్‌కి వెళ్ళిన మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని అడగడానికి నాకేమన్నా పిచ్చా.. ఉన్మాదమా?… సమయానికి మా అమ్మానాన్నలు ఉండబట్టి సరిపోయింది కానీ..
మీ అమ్మానాన్నలు చూసుకుంటాం నువ్వెళ్ళు బాబూ అంటేనే వెళ్ళానే.. గతం తవ్వి ఇప్పుడు ఫోన్‌లో గొడవేమిటి?

ఎక్కడ నన్ను చెప్పనిస్తున్నారు గనక!
మళ్ళీ మొదలెట్టక.. విషయం ఏంటో చెప్పు..
ఛ… ఈ నైటీ ఒకటి.. ఈ మడ్డి కలర్ నైటీ తీసుకురావద్దు అంటే వింటారా..
నేనెక్కడ తీసుకొచ్చానే.. నేను వేసుకునే బట్టలు కూడా నువ్వే కొంటావ్ కదా.. నాకు చాలా పని ఉంది ఆఫీస్ లో మంటలు పెట్టేమాటలు మాని ఎందుకు ఫోన్ ఎందుకు చేశావో చెప్పమ్మ తల్లీ..
సారీ సార్…మీ పని మీరు చూసుకోండి..పెళ్ళాం ఎలా పోతే మీకెందుకు..
ఓరి దేవుడోయ్.. నసుగుడు ఆపి మ్యాటర్ చెప్పవే బాబు..
ఇంటికి ఏదైనా కావాలంటే ఫోన్ కూడా చేయకూడదా ..?
సరే బాబు సరే.. ఇంతకీ ఏం కావాలో చెప్పు..

ఎక్కడ చెప్పనిచ్చావు? మొత్తం మరిచిపోయా.. గుర్తొచ్చాక చెప్తా… హుష్.. రామచంద్రప్రభో..
ఫోన్ కట్ చేశాడు. వెంటనే మోగింది ఫోన్..
ఎందుకు ఫోన్ కట్ చేశారు..నువ్వే కదే గుర్తొచ్చాక చెప్తానన్నావ్.. వేరేకాల్‌కు అడ్డమెందుకని..ఎందరున్నారు ఫోన్‌లు చేయడానికి.
నా మొహానికి అంత సీన్ కూడానా..హా.. ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది.. ఇప్పుడే అందిన వార్తలాగా ఎంత బిల్డప్ ఇచ్చావే బాబు.. చెప్పు.. చెప్పు..కాఫీ పొడి డబ్బా ఎంతో కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది.! ఎందుకు అంత పైనపెట్టారు… ఇక మీదట అలా చేయను.. సరేనా..

అంత కష్టపడి తీసి చూస్తే అందులో కాఫీ పొడి కొద్దిగా ఉంది. ఉదయం మీరేగా కాఫీ పెట్టారు..ఇప్పుడు ఈ పాయింట్ మీద వాయిస్తావా..?ఇలా ఎందుకు చేశావయ్యా మగడా అంటే వాయింపా..?మళ్ళీ మొదలెట్టకు.. చెప్పే మాట వినేదేమైనా ఉందా.. సాయంత్రం వచ్చేటపుడు కాఫీ పొడి తీసుకురండి..’

ఈ జన్మకు సరిపోయేంత తెస్తా.. సరేనా.. కాఫీపొడి కావాలి అని ఒక్కముక్క చెబితే పోయేదానికి ఇంత గోలా..
తెస్తారు.. తెస్తారు.. చెప్పినవన్నీ మర్చిపోయి ఆముదం తాగినట్టు నిలబడతారు. మీ సంగతి నాకు తెలియందా.. ఇప్పుడెలాగూ పక్కింటి వదిన గారితో షాపింగ్‌కెళ్తున్నా.. వస్తూవస్తూ తెచ్చుకుంటాను లెండి..మిమ్మల్ని నమ్మమన్నదెవరు?
బంగారూ..ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం కుదవపెట్టి డబ్బులిప్పిస్తాగానీ.. కాస్త ఎక్కువ కొనుక్కుని మమ్మల్ని కటాక్షించు..’
‘ఏంటన్నారూ.. హలో…హలో….’

Comments

comments