ఎపిలో పెరిగిన అవినీతి : అజయ్ కల్లాం

హైదరాబాద్ : ఎపిలో అవినీతి బాగా పెరిగిపోయిందని రిటైర్డ్ సిఎస్ అజయ్ కల్లాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎపి సిఎం చంద్రబాబునాయుడు పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై తాను ఒక పుస్తకాన్ని రాశానని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నగరాలను నిర్మిస్తూ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. […]

హైదరాబాద్ : ఎపిలో అవినీతి బాగా పెరిగిపోయిందని రిటైర్డ్ సిఎస్ అజయ్ కల్లాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎపి సిఎం చంద్రబాబునాయుడు పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై తాను ఒక పుస్తకాన్ని రాశానని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నగరాలను నిర్మిస్తూ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వాలు వ్యాపారం చేయడం వల్ల ప్రజలకు ఒరిగిదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అవినీతి వల్ల రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి జరిగినప్పుడే గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. అనుభవజ్ఞుల పాలన అంటే పెద్ద నగరాలను కట్టడం కాదని, ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమని ఆయన పేర్కొన్నారు.

Corruption Increased in AP : Ajay Kallam

Related Stories: