ఐపిఎల్ తెలుగు వ్యాఖ్యాతలుగా..

ముంబయి: ఈసారి ఐపిఎల్ మ్యాచ్‌లు ఆరు భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. తెలుగు ప్రసారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు ఎన్‌టిఆర్ వ్యవహరిస్తున్నారన్నది తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు తెలుగులో వ్యాఖ్యానం చేసేవారి జాబితాను నిర్వాహకులు వెల్లడించారు. వారిలో వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, కళ్యాణ్ కృష్ణ, సి. వెంకటేశ్, చంద్రశేఖర్, పి. సుధీర్ మహావడి ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లీషు, హిందీ, బం గ్లా, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కా […]

ముంబయి: ఈసారి ఐపిఎల్ మ్యాచ్‌లు ఆరు భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. తెలుగు ప్రసారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు ఎన్‌టిఆర్ వ్యవహరిస్తున్నారన్నది తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు తెలుగులో వ్యాఖ్యానం చేసేవారి జాబితాను నిర్వాహకులు వెల్లడించారు. వారిలో వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, కళ్యాణ్ కృష్ణ, సి. వెంకటేశ్, చంద్రశేఖర్, పి. సుధీర్ మహావడి ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లీషు, హిందీ, బం గ్లా, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కా నున్నాయి. అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100 మంది వ్యాఖ్యాతలు ఈ ఏడాది ఐపిఎల్ మ్యాచ్‌లకు పనిచేయనున్నారు. ఐపిఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ వాంఖడే మైదానంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగనుంది.
దూరదర్శన్‌లోనూ ఐపిఎల్ ప్రసారాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మ్యాచ్ ప్రసారాలను దూరదర్శన్‌లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఐపిఎల్ చరిత్రలో తొలిసారిగా దూరదర్శన్‌లో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. అయితే ఐపిఎల్ మ్యాచ్‌లు కాస్త ఆలస్యంగా ప్రసారం కానున్నాయిని ప్రభుత్వం పేర్కొంది. 201822 మధ్య జరిగే ఐపిఎల్ మ్యాచ్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా కైవసం చేసుకున్నది.
ప్రారంభ వేడుకలకు హృతిక్

ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సందడి చేయనున్నాడు. ఈ వేడుకల్లో ముందుగా రణ్‌వీర్ సింగ్ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నాడని సంగతి తెలిసిందే. కాగా సినిమా షూటింగ్‌లో రణ్‌వీర్ గాయపడ్డాడు. పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో అతడు ఐపీఎల్ ప్రారంభ వేడుకల నుంచి తప్పుకోవల్సి వచ్చింది. అకస్మాత్తుగా రణ్‌వీర్ తప్పుకోవడంతో ఐపీఎల్ నిర్వాహకులు హృతిక్ రోషన్‌ను సంప్రదించారు. వెంటనే అతడు ఒప్పుకున్నాడు. ఇప్పటికే హృతిక్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. వరుణ్‌ధావన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, పరిణీతి చోప్రాతో పలువురు నటీనటులు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేయనున్నారు.

Comments

comments

Related Stories: