నలుగురి చేతిలోనే రాష్ట్ర పాలన

* టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మన తెలంగాణ /జోగిపేట : నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర పాలన కేవలం నలుగురి కబంధ హస్తాల్లోనే కొనసాగుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. గు రువారం ఆయన జోగిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ నాడు ఎన్‌టిరామరావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్ని వర్గాలవారికి సముచిత స్థానం కల్పించారని, తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో సామాజిక వర్గాలవారికి కేబినెట్ లో మంత్రులుగా […]

* టి.టిడిపి
రాష్ట్ర అధ్యక్షుడు
ఎల్.రమణ

మన తెలంగాణ /జోగిపేట : నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర పాలన కేవలం నలుగురి కబంధ హస్తాల్లోనే కొనసాగుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. గు రువారం ఆయన జోగిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ నాడు ఎన్‌టిరామరావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్ని వర్గాలవారికి సముచిత స్థానం కల్పించారని, తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో సామాజిక వర్గాలవారికి కేబినెట్ లో మంత్రులుగా అవకాశం ఇ చ్చి సమాజ సేవలో భాగస్వాములను చేసే విధంగా ఎన్‌టిఆర్, చంద్రబాబు నాయుడు లు ప్రోత్సహించారని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం లో సిఎం కెసిఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్య క్తులకు, తన కుటుంబ సభ్యులకే మాత్రమే మంత్రి పదవులను కట్టబెట్టారని చెప్పారు. అలాగే దళితున్ని సిఎం చేసి రా ష్ట్రానికి కపల కుక్కలా ఉంటనన్నా చంద్రశేఖర్‌రావు రాష్ట్ర కెబినెట్‌లో ఇప్పటి వరకు మదిగలకు, మహిళలకు మంత్రి పదువులు ఇవ్వలేక పోవ డం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూ ర్వ వైభాన్ని సంతరించుకుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలే మాకు బద్ద శత్రువులని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి నరోత్తం, నాయకలు అమర్‌నాథ్, శ్రీనివాస్‌నాయుడు, నర్సారెడి, సారంగపాణి, జిల్లా నాయకులు విజయ్‌పాల్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, గంగా జోగినాథ్, విజయ్‌కుమార్, మమత, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీశైలం, కిష్టయ్యగౌడ్ పాల్గొన్నారు.

Related Stories: