నేరుగా రైతుకే

పెట్టుబడి సాయం చెక్కులు భూ యజమానికే ఇవ్వాలి గ్రామసభకు రాలేని పరిస్థితుల్లో రైతు చెంతకే వెళ్లి అందజేయాలి నెల రోజుల్లో ఎలాగైనా చెక్కు చేతికి ఇచ్చే బాధ్యత అధికారులది రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం మన తెలంగాణ/ హైదరాబాద్ : పంట పెట్టుబడి అవసరాల నిమి త్తం ‘రైతు బంధు’ చెక్కు మీద ఎవరి పేరు ఉంటే దాన్ని ఆ రైతులకే స్వయంగా అందజేసేలా ప్రభుత్వం పటిష్ట మార్గదర్శకాలను రూ పొందించింది. ఏదేని పరిస్థితుల్లో సంబంధిత […]

పెట్టుబడి సాయం చెక్కులు భూ యజమానికే ఇవ్వాలి

గ్రామసభకు రాలేని పరిస్థితుల్లో రైతు చెంతకే వెళ్లి అందజేయాలి
నెల రోజుల్లో ఎలాగైనా చెక్కు చేతికి ఇచ్చే బాధ్యత అధికారులది
రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/ హైదరాబాద్ : పంట పెట్టుబడి అవసరాల నిమి త్తం ‘రైతు బంధు’ చెక్కు మీద ఎవరి పేరు ఉంటే దాన్ని ఆ రైతులకే స్వయంగా అందజేసేలా ప్రభుత్వం పటిష్ట మార్గదర్శకాలను రూ పొందించింది. ఏదేని పరిస్థితుల్లో సంబంధిత రైతులు అందుబాటు లో లేకపోతే వారికి బదులుగా ఏ ‘నామినీ’కీ చెక్కును ఇవ్వకుండా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలో ‘గ్రామ సభ’ను ఏర్పాటు చేసి చెక్కులను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం తప్పనిసరిగా రైతుల పాసు పుస్తకం, ఆధార్ కార్డును వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి పరిశీలించాలని బుధవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అలాగే బ్యాంకులో నగదు తీసుకునే సమయంలో కూడా గుర్తింపు కోసం పట్టాదారు పాసు పుస్తకం లేదా ఆధార్ కార్డును లబ్దిదారు డు స్వయంగా వెళ్లి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రామసభకు వచ్చి చెక్కు తీసుకోలేని స్థితిలో (అనారోగ్యం లాంటివి) ఉంటే లబ్ధిదారుడి వద్దకే వెళ్లి అధికారులు చెక్కును ఇవ్వనున్నారు. ఏదేని పరిస్థితుల్లో చెక్కులు రైతులకు అందజేయలేని పక్షంలో గ్రామ సభలోనే నిర్ణయం తీసుకుని మండల వ్యవసాయాధికారి, మండల రెవిన్యూ అధికారి అనుమతితో సంబంధిత లబ్దిదారుడికి నెల రోజుల్లో చేర్చాలని కూడా మార్గదర్శాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను పేర్కొన్నారు. పక్కాగా పకడ్బందీగా పారదర్శంగా చెక్కుల పంపిణీ జరిగేలా వ్యవసాయాధికారులతో పాటు రెవిన్యూ అధికారులకు కూడా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారుల పర్యవేక్షణలో పెట్టుబడి చెక్కుల పంపిణీ జరగనుంది. చెక్కుల పంపిణీ ఏ మేరకు జరిగిందో ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు వ్యవసాయ విస్తరణ అధికారి స్థాయి వరకు ప్రభుత్వ సిబ్బంది చూసుకునేలా ప్రత్యేకంగా ఎన్‌ఐసి ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. చెక్కులను పంపిణీ చేసిన తర్వాత సంబంధిత అధికారులు సాయంత్రం ఆరు గంటలకల్లా ఈ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.
చెక్కుల పంపిణీపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు
* ప్రధాన భూపరిపాలన శాఖ ఇచ్చిన భూ, రైతు సమాచారాన్ని వ్యవసాయ శాఖ క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్‌ఐసి (నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సంస్థ)     ద్వారా 8 బ్యాంకులకు ముద్రణ బాధ్యతలు అప్పగించింది.
* చెక్కులపై రైతు బంధు పథకం, పట్టాదారు, పాసుపుస్తకం నెంబర్, రెవిన్యూ గ్రామం, మండలం, జిల్లా, నగదు మొత్తం, వ్యవసాయ శాఖ కమిషనర్   డిజిటల్ సంతకం ఉంటాయి.
* జిల్లా కలెక్టర్ డిఎఒలను సంప్రదించి ఏయే గ్రామంలో ఎప్పుడు చెక్కులను పంపిణీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.
* చెక్కుల పంపిణీకి రెండు రోజుల ముందే చెక్కులను ఏ రోజున ఏ గ్రామంలో పంపిణీ చేయనున్నారనే దానిపై ఆ గ్రామంలో చాటింపు (టామ్‌టామ్)   వేయనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో చెక్కులు పంపిణీ పూర్తి చేయనున్నారు.
* గ్రామ సభ నిర్వహించి ప్రజాప్రతినిధుల సమక్షంలో చెక్కులు రైతులకు పంపిణీ చేయనున్నారు. గ్రామ రెవిన్యూ అధికారి, రెవిన్యూ అసిస్టెంట్,   వ్యవసాయ విస్తరణ అధికారి తప్పక పాల్గొనాలి. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల సమన్వయకర్తలకు కూడా సమాచారం అందించాలి.   మండల వ్యవసాయధికారికి చెక్కుల పంపిణీపై పూర్తి బాధ్యతలు ఉంటాయి.
* చెక్కులు సంబంధిత రైతుకే ఇవ్వాలి. ఒక రైతు చెక్కు పొరపాటున ఇంకో రైతుకు చేరినట్లయితే పూర్తి బాధ్యత ఎఇఒ,విఆర్‌ఓలదే. ఇలా జరిగితే   సంబంధిత అధికారుల నిర్లక్షంపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటుంది.
* ఒకవేళ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందని పక్షంలో ఎమ్‌ఆర్‌ఓ ద్వారా గ్రామాలలోని లబ్ధిదారులకు విఆర్‌ఓలు పాసుపుస్తకంలో   రైతు ఫోటోతో కూడిన మొదటి పేజిని ముద్రించి గ్రామ సభ కంటే ముందే పట్టాదారులకు అందించాల్సి ఉంటుంది.
* రైతులకు ఆర్డర్ చెక్కులను ఇస్తారు. బ్యాంకులో ఇవి 90 రోజుల కాలవ్యవధిలో చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ రైతులు మూడు నెలల కాలం   ముగిసిన తరువాత చెక్కును బ్యాంకులకు వెళ్లి నగదుగా మార్చుకోవాల్సి వస్తే ఖచ్చితంగా వ్యవసాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలి.
* ఒకవేళ రైతులకు 13 ఎకరాలపైన భూమి ఉంటే రెండు చెక్కులు ఇస్తారు. అంటే ఒక్క చెక్కుపై మొత్తం రూ.49990 మాత్రమే ఉండనుంది. ఈ   మొత్తం మూడింతలు అయితే మూడు చెక్కులు ఇస్తారు.
* రైతులకు చెక్కులు ఇచ్చే సమయంలో ప్రభుత్వం ముద్రించి పంపిన పుస్తకాలలో (రికార్డులు) రైతు కులం పేరు, జెండర్, ఆధార్ నెంబర్, ఫోన్   నెంబర్, ప్రజాప్రతినిధులు ఎవరెవరు పాల్గొన్నారనే అనే విషయాలను నమోదు చేయనున్నారు.
* గ్రామంలో చెక్కులు పంపిణీ చేసిన రోజు సాయంత్ర 6 గంటల కల్లా ఏయే లబ్దిదారుడికి పంపిణీ చేసారనే వివరాలన్నింటి ప్రభుత్వం పేర్కొన్న రైతు   బంధు వెబ్‌సైట్‌లో క్లస్టర్, గ్రామాలా వారీగా నమోదు చేయాలి. మిగిలిన పోయిన చెక్కుల వివరాలు కూడా పొందుపర్చాలి. ఆ వెంటనే మండల,   జిల్లా వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలి. వెబ్‌పోర్టల్‌లోని వివరాలను డిఎఒలు జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ కమిషనర్‌కు   అందజేస్తారు.
* చెక్కుల పంపిణీ, రైతు బంధు పథకం అమలు తీరును సిఎం కార్యాలయం, వ్యవసాయ, ఆర్థిక శాఖ, జిల్లాల్లో కలెక్టర్లు, డిఎఒ, ఎడిఎ, ఎమ్‌ఎఒ,   ఎఇఒలకు ప్రత్యేకంగా ఐడి, పాస్‌వర్డ్‌లు ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు.
* జిల్లాస్థాయిలో కలెక్టర్లు లీడ్‌బ్యాంకు మేనేజర్‌లతో ప్రత్యేకంగా సమావేశమై చెక్కుల పంపిణీపై చర్చించి, ప్రణాళికబద్ధంగా పంపిణీ చేయాలి.
* డిఎఒలు, డిహెచ్, డిసిఒ, ఆర్‌డిఒలు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగే సమయంలో వాహనాల్లో సుడిగాలి పర్యటన చేస్తారు.
* చెక్కుల పంపిణీ పూర్తయిన తరువాత కాగ్, ఆర్‌బిఐ, నాబార్డు నిబంధనలకు అనుగుణంగా అడిట్ నిర్వహిస్తారు.
‘రైతుబంధు’ అమలు పర్యవేక్షణకు కమిటీ
రైతుబంధు పథకం అమలును పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మార్గదర్శకాల్లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టత ఇచ్చారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. సంయుక్త కార్యదర్శి (ఆర్థిక విభాగం), రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, రాష్ట్ర ఎన్‌ఐసి నోడల్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి సహాయకంగా ఉండేందుకు మరో కమిటీ కూడా ఏర్పాటవుతోంది. ఉద్యానవన శాఖ డైరెక్టర్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, విత్తన ధృవీకరణ డైరెక్టర్, సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీలో ఉంటారు.

Related Stories: