ఆర్జీలను పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని నియమించాలి

మన తెలంగాణ / ఆదిలాబాద్ టౌన్ : కిసాన్ మిత్ర, ప్రజావాణిల ద్వారా వచ్చే ఆర్జీలను పర్యవేక్షించడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నోడల్ అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిసాన్ మిత్ర కాల్ సెంటర్‌కు వచ్చే సమస్యలకు సంబంధించిన కాల్స్ వివరాలు ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేయడం జరుగుతున్నాయని, వాటిపై ఆయా […]

మన తెలంగాణ / ఆదిలాబాద్ టౌన్ : కిసాన్ మిత్ర, ప్రజావాణిల ద్వారా వచ్చే ఆర్జీలను పర్యవేక్షించడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నోడల్ అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి లో వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిసాన్ మిత్ర కాల్ సెంటర్‌కు వచ్చే సమస్యలకు సంబంధించిన కాల్స్ వివరాలు ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేయడం జరుగుతున్నాయని, వాటిపై ఆయా శాఖల అధికారులు సత్వరమే స్పందించి సమాధానాన్ని అప్‌డేట్ చేయాలన్నారు. వేసవిలో గ్రామాల్లో తాగు నీటి సమస్య, రుణాలు, సబ్సిడీలు, విద్యుత్ సౌకర్యం, కందుల కొనుగోళ్ల చెల్లింపులు, భూ సమస్యలు, దళిత బస్తీ కింద భూములు వంటి అంశాలకు సంబంధించిన వాటిపై ప్రజావాణిలో ఆర్జీలు రావడం జరిగిందన్నారు. కిసాన్ క్రేడిట్ కార్డుల విషయంలో లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. సర్వే నెంబర్ 170,0181కి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆర్డీవోను ఆదేశించారు. అంతకు ముందు జేసీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇండియన్‌రెడ్ క్రాస్ సొసైటిలో జిల్లా అధికారులు సభ్యత్వం పొందాలన్నారు. త్వరలో ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని జిల్లాల్లో ఐఆర్‌సీఎస్‌ను బలోపేతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, డీఆర్‌డీఓ రాజేశ్వర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: