పరిమాణంలో కొత్త గ్రహం..!

లండన్: వేడిగా, లోహాలతో కూడి భూమి అంత ఉన్న కొత్త గ్రహాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. 260 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో చిన్న నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతోందన్నారు. ఈ గ్రహానికి కె2229బి అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమికన్నా 20 శాతం పెద్దది. కాని దాని పదార్థం(మాస్) రెండున్నర రెట్లు ఉంటుంది. ఆ గ్రహం పగటి ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉంటుం ది. ఈ గ్రహంను తనకు ఆతిథేయి నక్షత్రం(హోస్ట్ స్టార్) […]

లండన్: వేడిగా, లోహాలతో కూడి భూమి అంత ఉన్న కొత్త గ్రహాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. 260 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో చిన్న నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతోందన్నారు. ఈ గ్రహానికి కె2229బి అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమికన్నా 20 శాతం పెద్దది. కాని దాని పదార్థం(మాస్) రెండున్నర రెట్లు ఉంటుంది. ఆ గ్రహం పగటి ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉంటుం ది. ఈ గ్రహంను తనకు ఆతిథేయి నక్షత్రం(హోస్ట్ స్టార్) 0.012 ఎయుకు దగ్గరగా ఉండడాన్ని గుర్తించారు. భూమికి,సూర్యునికి మధ్య ఉన్న దూరంలో 100వ వంతు దూరంలో ఈ ఆతిథేయి నక్షత్రం ఉంది. ఫ్రాన్స్‌లోని ఏక్స్ మార్‌సైల్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్‌లోని వార్‌విక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కె2 టెలిస్కోప్‌ను ఉపయోగించి ‘చలించు పద్ధతి’(వబ్బుల్ మెథడ్)లో ఈ గ్రహాన్ని కనుగొన్నారు. వారు గ్రహం పరిమాణంను, పదార్థాన్ని కూడా కొలిచారు.

Comments

comments