ఎపి కోసం రాజీలేని పోరాటం : చంద్రబాబు

అమరావతి : ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. మంగళవారం అమరావతిలో అఖిల పక్షాలతో ఎపి ప్రభుత్వం భేటీ నిర్వహించింది. ఈ భేటికి సిఎం చంద్రబాబునాయుడు అధ్యక్షత వహించారు. ఎపి ప్రభుత్వం చేసే పోరాటాలకు పూర్తి మద్దతు ఇస్తామని అఖిల పక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. దేశాన్ని కదిలించే సమర్థత , అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పోరాటానికి […]

అమరావతి : ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. మంగళవారం అమరావతిలో అఖిల పక్షాలతో ఎపి ప్రభుత్వం భేటీ నిర్వహించింది. ఈ భేటికి సిఎం చంద్రబాబునాయుడు అధ్యక్షత వహించారు. ఎపి ప్రభుత్వం చేసే పోరాటాలకు పూర్తి మద్దతు ఇస్తామని అఖిల పక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. దేశాన్ని కదిలించే సమర్థత , అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పోరాటానికి దశ, దిశ నిర్దేశించాలని అఖిల సంఘాలు అభిప్రాయపడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని , రాజకీయాలకు అతీతంగా జరిపే పోరాటంలో అందర్ని భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు. శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడపాలని అన్నారు. ఏప్రిల్ 2,3 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులను కలుస్తానని చంద్రబాబు తెలిపారు. హేతుబద్ధంగా రాష్ట్ర విభజన చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని, దీంతోనే రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపితో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ నాలుగు ఏళ్లలో 29 ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నెరవేర్చాల్సిన హామీలను గుర్తు చేశానని ఆయన స్పష్టం చేశారు. రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటు గురించి కేంద్రానికి గుర్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, అందుకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్రం చెప్పడంతో తాను అందుకు అంగీకరించానని చంద్రబాబు తెలిపారు. నాలుగేళ్ల క్రితమే కేంద్రంతో పోరాటం చేసి ఉంటే, రాష్ట్రానికి మరింత అన్యాయం జరిగి ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు, ఇంకా అనేక అంశాలపై ఈ అఖిలపక్ష భేటీలో చర్చించారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ సహా పలు ప్రజా సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

Uncompromising fight for AP : Chandrababu

Comments

comments

Related Stories: