పేదలకు చేరని పథకాలు

* గడువు దగ్గర పడుతున్నా… అందని ఇంటింటికీ విద్యుత్  మనతెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో: ఉమ్మడి జిల్లాలోని అధికారుల తీరుతో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలతో లబ్ది చేకూరడం లేదని అభిప్రా యాలువ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లోని నిరుపేదలకు (డిడియు జెజె వై) దీనదయాళ్ ఉపాద్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద రూ.125 లకే విద్యుత్తు కనెక్షన్ సౌకర్యం కల్పించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 23వేల మంది లబ్దిదారులు ఉన్నట్లు అధికార […]

* గడువు దగ్గర పడుతున్నా… అందని ఇంటింటికీ విద్యుత్ 

మనతెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో: ఉమ్మడి జిల్లాలోని అధికారుల తీరుతో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలతో లబ్ది చేకూరడం లేదని అభిప్రా యాలువ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతా ల్లోని నిరుపేదలకు (డిడియు జెజె వై) దీనదయాళ్ ఉపాద్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద రూ.125 లకే విద్యుత్తు కనెక్షన్ సౌకర్యం కల్పించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 23వేల మంది లబ్దిదారులు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తిం చింది. అయితేపథకంఅమలుకు రూ.15 కోట్లు మంజూరై నప్పటికీ ప్రతి ఇంటికి విద్యు త్తు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన ఉప కేంద్రాల నిర్మాణానికి ప్రతిపా దించారు. విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడానికి అవసరమైన సదుపా యాలు న్న చోట్ల కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా గడువు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు పది శాతం మందికి కూడా సౌకర్యం కల్పించలేకపోయారనే విమర్శలున్నాయి. మార్చి నెలలోగా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఉపకేంద్రాల్లో కొన్ని నిర్మాణంలో ఉండగా, మరికొన్ని ప్రారం భానికి నోచుకోలేదు. రూ. 125 చెల్లిస్తే విద్యు త్తు కనెక్షన్‌కు అవసరమైన సామా గ్రిని విద్యుత్తు శాఖనే సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయా లని నిర్ణయించగా, ఈ పథకం పూర్తిగా ఉచి తమని చెబుతున్నారు. ఈ లెక్కన అసలు విద్యు త్తు సదుపాయం లేనిఇళ్లు అనేది ఉండ వద్దని ప్రభుత్వ ఆశయం. కాని ఇంకా అనేక గిరిజన గ్రామాలు అంధకారంలోనే మగ్గు తుండ డం అధికారుల తీరును ఎత్తి చూపు తున్నాయని అంటున్నారు. దేశంలో విద్యుత్తు సౌకర్యం లేని ఇళ్ళన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్‌ఘర్ యోజన (సౌభాగ్య) పథకం అమలు చేయనుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన మార్గదర్శకా లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యుత్తు శాఖ కార్యాలయాలకు పం పించింది.

ఈ పథకం కింద ఈ ఏడాది కరెంట్ కనెక్షన్ లేని ప్రతి ఒక్కరికి విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయా లని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని వల్ల ఉమ్మడి జిల్లాలో పది వేల మందికిపైగా నిరుపేదలు లబ్దిపొందే వీలుండగా, ఈ కోటాలోకి రాని వారికి రూ.500లకు విద్యుత్ కనెక్షన్‌ను ఇస్తారు. ఈడబ్బులను కూడావెంటనే తీసుకో కుండా నెలబిల్లులో రూ. 50 చొప్పున మిన హా యించే అవకాశం కల్పించారు. విద్యుత్తు శాఖ పరిధిలోని సమస్యలను పరిష్కరించ డంతో పాటు విద్యుత్తు కనెక్షన్లు లేని వారిని గుర్తించి కనెక్షన్ మంజూరు చేసేందుకు లబ్ది దారులను అధికారులు గుర్తించాల్సి ఉండ గా, అసలు పట్టించు కోవడం లేదనే విమ ర్శలున్నాయి. క్షేత్రస్థాయి నుంచి  ఎలాంటి ప్రతిపాదనలు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. మారుమూల గ్రామాల్లోని అనేక మందికి ఇప్పటికీ ఇళ్లలో విద్యుత్తు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కనెక్షన్ల కోసం మంజూరయ్యే నిధులతో ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో కొన్ని నిర్మాణంలో ఉండగా, మరికొన్నింటిని ప్రారంభించాల్సి ఉంది. ఒకప్పుడు వ్యవసా యా నికి విద్యుత్తు సరఫరా అంటే రైతులకు పెద్ద ఇబ్బందిగా ఉండేది. అలాంటిది 24 గంటలు విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో ఉపకేంద్రాల నిర్మా ణాలకు నిధులు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలలో సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ఈ పథకాలపై విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో విద్యుత్ సౌకర్యం లేని వారికి ప్రయోజనం చేకూరడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పథకాలపై పూర్తి స్థాయిలో ప్రచారం చేపట్టి పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

Comments

comments

Related Stories: