రుణమాఫీ పథకం బాగుంది: ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్: రైతులకు రుణమాఫీ పథకం బాగుందని టిడిపి ఎంఎల్‌ఎ ఆర్. కృష్ణయ్య ప్రశంసించారు. గురువారం శాసన సభలో ఆయన మాట్లాడుతూ…. రుణమాఫీ చేసినా… వడ్డీ కోసం రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లోనే ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శాసనసభలో చట్టం చేయాలని కోరారు. సబ్సిడీపై ఆవులు, గొర్రెలను ప్రజలకు, రైతులకు అందించాలని, పౌరసరఫరాల శాఖపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కార్డుల పంపిణీలో అక్రమాలు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిన్న […]

హైదరాబాద్: రైతులకు రుణమాఫీ పథకం బాగుందని టిడిపి ఎంఎల్‌ఎ ఆర్. కృష్ణయ్య ప్రశంసించారు. గురువారం శాసన సభలో ఆయన మాట్లాడుతూ…. రుణమాఫీ చేసినా… వడ్డీ కోసం రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లోనే ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శాసనసభలో చట్టం చేయాలని కోరారు. సబ్సిడీపై ఆవులు, గొర్రెలను ప్రజలకు, రైతులకు అందించాలని, పౌరసరఫరాల శాఖపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కార్డుల పంపిణీలో అక్రమాలు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న కారణాలతో కార్డులు తొలగిస్తున్నారని, వాస్తవాలను పరిశీలించి అర్హత లేని వారి కార్డులను తొలగించాలన్నారు. కార్డుల ద్వారా తొమ్మిది రకాల ఆహార పదార్థాలను ప్రభుత్వం అందించాలని సూచించారు.

Related Stories: