ఇండియన్ సోఫియా ‘వీర్’

ప్రపంచంలోనే తొలి మానవరూప రోబో సోఫియా గురించి అందరికీ తెల్సిందే. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పుణెకు చెందిన అనిల్‌జైన్ వీర్ అనే రోబోను తయారుచేస్తు న్నాడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేస్తుంది. సోఫియా తరహాలోనే మాట్లాడుతుంది. పాటలు పాడుతుంది. మంత్రాలు కూడా జపిస్తుందంటున్నాడు. వీర్‌ను మనిషి రూపంలోకి మార్చేందుకు అనిల్ త్రీడీ టెక్నాలజీతో ముఖాన్ని తయారుచేశాడు. ఒంటరిగా ఉండేవారికి సాయం చేయడానికి అనువుగా ఉండే క్లోన్ రోబోలను తయారుచేయడం తన లక్షమంటున్నాడు.  వీర్‌ను తయారుచేయడానికి 14 నెలలు […]

ప్రపంచంలోనే తొలి మానవరూప రోబో సోఫియా గురించి అందరికీ తెల్సిందే. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పుణెకు చెందిన అనిల్‌జైన్ వీర్ అనే రోబోను తయారుచేస్తు న్నాడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేస్తుంది. సోఫియా తరహాలోనే మాట్లాడుతుంది. పాటలు పాడుతుంది. మంత్రాలు కూడా జపిస్తుందంటున్నాడు. వీర్‌ను మనిషి రూపంలోకి మార్చేందుకు అనిల్ త్రీడీ టెక్నాలజీతో ముఖాన్ని తయారుచేశాడు. ఒంటరిగా ఉండేవారికి సాయం చేయడానికి అనువుగా ఉండే క్లోన్ రోబోలను తయారుచేయడం తన లక్షమంటున్నాడు.  వీర్‌ను తయారుచేయడానికి 14 నెలలు పట్టింది. వీర్‌కు మొదట అమ్మాయి గొంతు ఇచ్చి,  సోఫియా ఉన్నందువల్ల పురుష గొంతును మార్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం వీర్ తల మాత్రమే తయారైనట్లు వెల్లడించాడు.

Comments

comments