కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను సమర్థించిన ఎంఐఎం

హైదరాబాద్ : అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఎంఐఎం సమర్థించింది. శాసనసభలో మంగళవారం ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు అసహన రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు తగవని ఆయన హితవు పలికారు. గవర్నర్‌పై దాడి చేయబోతే, మండలి చైర్మన్‌కు తగిలిందని కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గు చేటని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి తమ పూర్తి […]

హైదరాబాద్ : అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఎంఐఎం సమర్థించింది. శాసనసభలో మంగళవారం ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు అసహన రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు తగవని ఆయన హితవు పలికారు. గవర్నర్‌పై దాడి చేయబోతే, మండలి చైర్మన్‌కు తగిలిందని కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గు చేటని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి తమ పూర్తి మద్ధతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. సోమవారం అసెంబ్లీ జరిగిన దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో అన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిపోతుండడంతో ఆ పార్టీ నేతల్లో అసహనం నెలకొందని ఆయన పేర్కొన్నారు. చట్ట సభల గౌరవం కాపాడేందుకు ప్రతి సభ్యుడు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన సూచించారు.

MIM supporting the Suspension of Congress MLAs

Comments

comments

Related Stories: