రాజ్యసభ అభ్యర్థిగా డాక్టర్ బండా ప్రకాశ్

మన తెలంగాణ/ వరంగల్‌బ్యూరో : టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న డాక్టర్ బండా ప్రకాశ్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌ఎసిలు, ఎంపిలతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను రాజ్యసభకు ప్రకటించారు. వరంగల్ నుంచి డాక్టర్  బండా ప్రకాశ్‌తోపాటు నల్లగొండ జిల్లా నుంచి బడుగుల లింగయ్య యాదవ్, హైదరాబాద్ సెంటర్ […]

మన తెలంగాణ/ వరంగల్‌బ్యూరో : టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న డాక్టర్ బండా ప్రకాశ్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌ఎసిలు, ఎంపిలతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను రాజ్యసభకు ప్రకటించారు. వరంగల్ నుంచి డాక్టర్  బండా ప్రకాశ్‌తోపాటు నల్లగొండ జిల్లా నుంచి బడుగుల లింగయ్య యాదవ్, హైదరాబాద్ సెంటర్ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్ పేర్లను ప్రకటించారు. రెండు సంవత్సరాల క్రితమే డాక్టర్ బండా ప్రకాశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారు. విద్యావంతుడు డాక్టర్ బండా ప్రకాశ్ ఎంఎ, పిహెచ్‌డి చేశారు. విద్యావేత్తగా పేరుంది. వరంగల్‌లో అరూరి ఇనిస్టిట్యూట్ విద్యా సంస్థను నడుపుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌సార్‌కు ప్రధాన శిశ్యుడిగా పనిచేశారు. బండా ప్రకాశ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గంలో నడిచారు.
అనేక సేవా కార్యక్రమాలు
డాక్టర్ బండా ప్రకాశ్ టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం వర్కింగ్ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్‌ఆర్‌డి) వరంగల్‌శాఖ అధ్యక్షుడిగాను, ముదిరాజ్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడిగా, తెలంగాణ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. డాక్టర్ జయశంకర్ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్టుకు మేనేజింగ్‌ట్రస్టీగా పనిచేస్తున్నారు. గతంలో 1981నుంచి 84 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా, వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా 1981 నుంచి 1986 వరకు, కుడా సభ్యుడిగా 1983నుంచి 1985 వరకు పనిచేశారు. విద్యార్థి సంఘాలలో ఎవివి జూనియర్ కళాశాల అధ్యక్షుడిగా, సికెం, ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
విద్యా సంస్థలలో.. కాకతీయ విశ్వవిద్యాలయం బోర్డు ఆఫ్ మేనేజిమెంట్ సభ్యుడిగా 1991 నుంచి 94 వరకు పనిచేశారు. కాకతీయ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులు, సొసైటి ఫర్ సోషల్ సైన్స్ సభ్యులు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ న్యూఢిల్లీ శాశ్వత సభ్యునిగా పనిచేస్తున్నారు. ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ న్యూఢిల్లీ సభ్యునిగా ఉన్నారు.
-క్రీడలు, సాంస్కృతిక సంస్థలతో.. తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా, జూడో జాతీయ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఉపాధ్యక్షుడిగా, ఇండియన్ టిం మేనేజర్ , ఆసియా జూడో చాంపియన్‌షిప్-2007కువైట్ , వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా, తెలంగాణ కోకో అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట సైక్లింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా, పర్యాటక కళాపరిషత్ , సాంస్కృతిక సంస్థల గౌరవాధ్యక్షుడి గా పనిచేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థా యి క్రీడలను వరంగల్, హైదరాబాద్ వేదికలుగా నిర్వహించారు.
నేడు నామినేషన్… టిఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థిగా ఎంపిక కాబడిన డాక్టర్ బండా ప్రకాశ్ సోమవారం పా ర్టీ తరుపున రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. దాదాపుగా బండా ప్రకా శ్ రాజ్యసభకు నామినేట్ అయినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
-వరంగల్‌లో సంబురాలు.. టిఆర్‌ఎస్‌పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా వరంగల్ నుంచి డాక్టర్ బండా ప్రకాశ్ పేరును ప్రకటించగానే వరంగల్‌లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచాను కాల్చుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. బండా ప్రకాశ్ అభిమానులు, ప్రధాన అనుచరులు మిఠాయిలు పంచుకున్నారు.

Related Stories: