డివిలియర్స్ పోరాటం

ఆమ్లా, ఎల్గర్ అర్ధ సెంచరీలు, సౌతాఫ్రికా 263/7 పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 243 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కాగా, తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు ఎబి.డివిలియర్స్ 74(నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఒక దశలో […]

ఆమ్లా, ఎల్గర్ అర్ధ సెంచరీలు, సౌతాఫ్రికా 263/7

పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 243 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కాగా, తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు ఎబి.డివిలియర్స్ 74(నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఒక దశలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులతో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికాను తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ మ్యాచ్‌లో మళ్లీ పైచేయి సాధించారు. కమిన్స్, మిఛెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కష్టాల్లోకి నెట్టారు. మరోవైపు సఫారీ జట్టులో ఓపెనర్ ఎల్గర్ ఆరు ఫోర్లతో 57 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు హాషిం ఆమ్లా కూడా కీలక అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన ఆమ్లా ఆరు బౌండరీలతో 56 పరుగులు చేశాడు. వీరిద్దరూ వెంటవెంటనే ఔట్‌కావడంతో దక్షిణాఫ్రికా కష్టాలు మొదలయ్యాయి. కెప్టెన్ డుప్లెసిస్ (9), వికెట్ కీపర్ డికాక్ (9), బ్రూన్ (1) నిరాశ పరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా డివిలియర్స్ పోరాటం కొనసాగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డివిలియర్స్ 14 ఫోర్లతో 74 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి ఫిలాండర్ 14 (బ్యాటింగ్) అండగా నిలిచాడు.

రబడాపై రెండు టెస్టుల నిషేధం

క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడాపై ఐసిసి రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రబడా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో దురుసుగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే తొలి ఇ న్నింగ్స్‌లో స్మిత్‌ను రబడా ఎల్బీ డబ్లూగా వెనక్కి పంపాడు. ఈ సమయంలో రబడా కా వాలని స్మిత్ భుజాన్ని తాకాడు. దీనిపై మైదానంలో ఉన్న ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన రిఫ రీ రబడా ఉద్దేశ పూర్వకంగానే స్మిత్ భుజాన్ని తాకినట్టు తేలింది. దీంతో రబడా మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించడంతో పా టు మూడు డీమెరిట్ పాయింట్లు జత చేశాడు. కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందే రబడా ఖాతాలో ఐదు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా జత కలిపిన ఐదు పాయింట్లతో దాని సంఖ్య 8కి చేరింది. దీంతో ఐసిసి నిబంధనల ప్రకారం ఏ ఆటగాడి ఖాతాలోనైనా 8 డీమెరిట్ పాయింట్లు జమా అయితే అతనిపై రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు. రబడా విషయంలో ఐసిసి ఈ నిబంధనను పాటించింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లో ఆడకుండా రబడాపై ఐసిసి నిషేధం విధించింది. కాగా, తొలి టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్‌లపై కూడా ఐసిసి క్ర మశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిం దే. ఇద్దరు క్రికెటర్లకు మూడేసి డీమెరిట్ పా యింట్లను జమ చేశారు.

Comments

comments

Related Stories: