ఎనిమిదో అంతస్థు నుంచి దూకిన ఇద్దరు విద్యార్థినులు

 అక్కడికక్కడే మృతి  హైదరాబాద్ ఎల్‌బినగర్ వద్ద విషాదం మన తెలంగాణ/మన్సూరాబాద్: ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఎనిమిదో అంతస్తు నుంచి దూకి మృతి చెందిన సంఘటన ఎల్‌బినగర్ ఠా ణా పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బినగర్  ఎస్‌ఐ మారయ్య  తెలిపిన వివరాలు ప్రకారం భార్గవి పటేల్ (15), శ్రావణి(15)  ఇద్దరు స్నేహితులు  ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నారు. భార్గవి పటేల్ ఎల్‌బినగర్, సరూర్‌నగర్ రహదారిలో గల టిఎన్ ఆర్ అపార్టు మెంట్ లో నివాసం ఉంటున్నది. […]

 అక్కడికక్కడే మృతి  హైదరాబాద్ ఎల్‌బినగర్ వద్ద విషాదం

మన తెలంగాణ/మన్సూరాబాద్: ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఎనిమిదో అంతస్తు నుంచి దూకి మృతి చెందిన సంఘటన ఎల్‌బినగర్ ఠా ణా పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బినగర్  ఎస్‌ఐ మారయ్య  తెలిపిన వివరాలు ప్రకారం భార్గవి పటేల్ (15), శ్రావణి(15)  ఇద్దరు స్నేహితులు  ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నారు. భార్గవి పటేల్ ఎల్‌బినగర్, సరూర్‌నగర్ రహదారిలో గల టిఎన్ ఆర్ అపార్టు మెంట్ లో నివాసం ఉంటున్నది. శ్రావణి చిత్ర లే అవుట్‌లోని మంజీర్ హైట్స్‌లో ఉంటోంది. భార్గవి పటేల్ తండ్రి క్రాంతి పటేల్ ఎల్‌బినగర్‌లో వ్యాపారం చేస్తున్నారు. శ్రావణి తండ్రి నరేందర్ కాలేజి సైంటిస్టుగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈ ఇద్దరు విద్యార్థినులు టిఎన్‌ఆర్ అపార్టు మెంట్‌లో చదువుకుంటున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో అపార్టు మెంట్ ఎనిమిదో అంతస్తు నుంచి దూకి అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు విద్యార్థినుల మృత దేహలను ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు. శ్రావణి తండ్రికి ‘ఐ మిస్ యు’ అనే సూసైడ్ నోట్ దొరికింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Comments

comments

Related Stories: