భారత మార్కెట్లోకి ఎస్9, ఎస్9+

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్ భారత మార్కెట్‌లోకి తన కొత్త స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్9, ఎస్9+ను మంగళవారం విడుదల చేసింది. శామ్‌సంగ్ తన ఎస్ సిరీస్‌ను హైఎండ్ ఫోన్లు(ఫుల్ స్క్రీన్ వ్యూవ్) అయిన ఆపిల్ ఐఫోన్ 10, గూగుల్ పిక్సల్ 2 సిరీస్‌కు పోటీగా భావిస్తోంది. అంతేగాక వీటిలో స్లో మోషన్ వీడియో, డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, డ్యయల్ అపెర్చర్ కెమెరా, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా కల్పించింది. […]

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్ భారత మార్కెట్‌లోకి తన కొత్త స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్9, ఎస్9+ను మంగళవారం విడుదల చేసింది. శామ్‌సంగ్ తన ఎస్ సిరీస్‌ను హైఎండ్ ఫోన్లు(ఫుల్ స్క్రీన్ వ్యూవ్) అయిన ఆపిల్ ఐఫోన్ 10, గూగుల్ పిక్సల్ 2 సిరీస్‌కు పోటీగా భావిస్తోంది. అంతేగాక వీటిలో స్లో మోషన్ వీడియో, డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, డ్యయల్ అపెర్చర్ కెమెరా, డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా కల్పించింది. ఇక ఈ రెండు ఫోన్లు రెండు వేర్వేరు వెరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. 64జిబి ఉన్న గెలాక్సీ ఎస్9 ధర రూ.64,000గా, గెలాక్సీ ఎస్9+ ధర రూ.64,000గా సంస్థ నిర్ణయించింది. అలాగే 256జిబి మెమొరీ సామర్థ్యం గల ఎస్9 ను రూ.65,900కు, ఎస్9+ను రూ.72,000కు విక్రయించనున్నట్లు ప్రకటించింది. మార్చి 16 నుంచి మార్కెట్లో కస్టమర్లను ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని శామ్‌సంగ్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

గెలాక్సీ ఎస్9, ఎస్9+ ఫీచర్ల విషయానికి వస్తే… గెలాక్సీ ఎస్‌9లో 5.8 అంగుళాల తాకే తెర, 4జిబి ర్యామ్‌, 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్(400జిబిల వరకు విస్తరించుకునే సదుపాయం), 12 మెగాపిక్సల్ వెనక కెమెరా, 8 మెగాపిక్సల్  సెల్ఫీ కెమెరా, 3,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. అలాగే గెలాక్సీ ఎస్‌9+లో 6.2 అంగుళాల తాకే తెర, 6జిబి ర్యామ్‌, 256జిబి రోమ్(400జిబిల వరకు విస్తరించుకునే సదుపాయం), 12 మెగాపిక్సల్ వెనక కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3,500 ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి.

Related Stories: