సెన్సెక్స్ @ 35,500

 10,900 మార్క్‌కు చేరువలో నిఫ్టీ రికార్డులతో అదరగొడుతున్న ఈక్విటీ మార్కెట్లు న్యూఢిల్లీ: కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌కు మరింత జోష్‌ను ఇచ్చాయి. బుల్ పరుగు ఆగడం లేదు. సూచీలు వెనుదిరిగి చూడకుండా వెంటవెంటనే కొత్త రికార్డులతో పాత రికార్డులను బద్దలు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితమే 35 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. మళ్లీ 500 పాయింట్లు లాభపడి 35,500 పాయింట్లను క్రాస్ చేసిన సరికొత్త శిఖరాలను చేరుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఆల్‌టైం […]

 10,900 మార్క్‌కు చేరువలో నిఫ్టీ
రికార్డులతో అదరగొడుతున్న ఈక్విటీ మార్కెట్లు

న్యూఢిల్లీ: కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌కు మరింత జోష్‌ను ఇచ్చాయి. బుల్ పరుగు ఆగడం లేదు. సూచీలు వెనుదిరిగి చూడకుండా వెంటవెంటనే కొత్త రికార్డులతో పాత రికార్డులను బద్దలు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితమే 35 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. మళ్లీ 500 పాయింట్లు లాభపడి 35,500 పాయింట్లను క్రాస్ చేసిన సరికొత్త శిఖరాలను చేరుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల అంశాలు కూడా దేశీయ సూచీలకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. మదుపర్ల కొనుగోళ్ల జోరుతో సూచీలు పైపైకి ఎగబాకాయి. కొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 251 పాయింట్లు లాభపడి 35,511 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిని చేరుకుంది. నిఫ్టీ కూడా 78 పాయింట్ల లాభంతో 10,895 వద్ద ముగిసింది. ప్రధానంగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. స్టాక్‌మార్కెట్లో బ్యాంకింగ్ జోష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్యాంక్ కౌంటర్లు కొనుగోళ్లతో హోరెత్తాయి. బ్యాంక్ నిఫ్టీ 1.4 శాతం లాభపడగా, ఆ తర్వాత రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసిజి, ఐటీ రంగాలు బలపడ్డాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.8 శాతం చొప్పున పుంజుకున్నాయి.
నగదు విభాగంలో గురువారం (ఎఫ్‌పిఐ)విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.1895 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్(డిఐఐ) రూ. 657 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఎఫ్‌పిఐలు బుధవారం రూ.625 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి.

Comments

comments

Related Stories: