టాప్ మెసెంజర్ యాప్ వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్‌తో తన వినియోగదారుల ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉండే వ్యక్తిని పూర్తిగా గ్రూప్ నుంచి తొలగించడకుండా అడ్మిన్‌గా మాత్రమే తొలగించే సదుపాయం గల న్యూ ఫీచర్‌ను తీసుకురాబోతోందట. వాట్సాప్ గ్రూప్‌లో ఎంతమందైనా గ్రూప్ అడ్మిన్లుగా ఉండొచ్చు. కానీ, అలా ఉన్నవారిని ఎవరైనా అడ్మిన్ నుంచి తీసేయాలంటే మాత్రం ముందు వారిని గ్రూప్ నుంచి పూర్తిగా తొలగించాల్సి ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అనంతం మళ్లీ వారిని గ్రూప్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా అడ్మిన్‌ను నేరుగా తొలగించేందుకు వీలుగా ‘డిస్మిస్’ బటన్‌తో కూడిన ఫీచర్‌ను వాట్సాప్ కొత్తగా తీసుకువస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఒఎస్లో ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉంది. పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ యత్నిస్తోంది. ఇటీవలె ఆడియో కాల్ నుంచి నేరుగా వీడియో కాల్ కు మారే సదుపాయాన్ని తీసుకువచ్చేందుకు పరీక్షిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించిన విషయం విదితమే.
WhatsApp testing new feature to ‘dismiss’ someone as group admin.
Comments
comments