సారు రూటే సపరేటు!

కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న ప్రజలు సమన్వయ లోపం, ప్రజలకు శాపం ధృవీకరణ పత్రాలు రాక ఇక్క ‘ముక్కు కోసిన ముందటోడే మంచోడన్న’ సామేతగా తయారైంది ఖమ్మం కార్పొరేషన్ పరిస్థితి. గత కమిషనర్ తీరు బాగోలేదని ఐఎఎస్ అధికారిని తెచ్చుకుంటే ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్లయింది’. పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. చెత్తనిల్వలు పేరుకుపోతున్నాయి. సమన్వయం లోపించింది. అనుమతులు రావడం దాదాపుగా నిలిచిపోయింది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సారూ మాత్రం ‘నా రూటే […]

కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న ప్రజలు సమన్వయ లోపం, ప్రజలకు శాపం ధృవీకరణ పత్రాలు రాక ఇక్క

‘ముక్కు కోసిన ముందటోడే మంచోడన్న’ సామేతగా తయారైంది ఖమ్మం కార్పొరేషన్ పరిస్థితి. గత కమిషనర్ తీరు బాగోలేదని ఐఎఎస్ అధికారిని తెచ్చుకుంటే ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్లయింది’. పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. చెత్తనిల్వలు పేరుకుపోతున్నాయి. సమన్వయం లోపించింది. అనుమతులు రావడం దాదాపుగా నిలిచిపోయింది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సారూ మాత్రం ‘నా రూటే సపరేటు’అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అమలు కానీ నియమాలతో అభివృద్ధ్ది కుంటుపడింది.

మన తెలంగాణ/ ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో గత కొంత కాలంగా ఫైళ్లు పడకేశాయి. ఏ ధృవీకరణ పత్రమైనా అందించేందుకు అధికారులు ససే మీరా అంటున్నారు. జనన, మరణాలకు సంబంధిం చిన ధృవపత్రాలు సైతం అందే  కార్పొరేషన్‌లో కదలని ఫైళ్లుపరిస్థితి లేదు. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంకార్పొరేషన్‌గా మారిన తర్వాత నగరాభివృద్దికి ప్రభుత్వం కోట్ల రూపాయలనుకేటాయించినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఐఏఎస్ అధికారిఉంటే అభివృద్ది వేగంగా జరగడంతో పాటు పాలన మరింతసులభతరమవుతుందని భావించారు. ఇదే ఆలోచనతో ప్రభుత్వం ఖమ్మంకార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారిని కేటాయించింది. ఐఏఎస్ అధికారి బాధ్యతలుస్వీకరించిన తర్వాత పరిస్థితి ఆశించిన దానికి విరుద్దంగా మారింది. మూడునెలలుగా ఖమ్మం కార్పొరేషన్‌లో జనన, మరణాలకు సంబంధించిన ధృవపత్రాలుఇవ్వడం లేదు. ధృవీకరణ పత్రాల కొరకు, అన్ని ధృవపత్రాలు సమర్పించినస్వీయ పరిపాలన అంటూ కార్యాలయం చుట్టూ జనాలను తిప్పుకుంటున్నారు.నగరంలో నిర్వహణ రంగం కాస్త పుంజుకుంటుందన్న ఈ సమయంలోనిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలువురు దరఖాస్తు చేశారు.దరఖాస్తు చేసి అనుమతి కొరకు కార్యాలయం చుట్టూ మూడు నెలలుగాతిరుగుతున్న అనుమతులు ఇచ్చేందుకు రకరకాల కొర్రిలు పెడుతున్నారే తప్పఅనుమతులు ఇవ్వడం లేదు. ఇక అభివృద్ది పనులు చేపట్టి వారు సైతం బిల్లులురాక మరోపని చేసేందుకు జంకుతున్నారు. దీంతో అభివృద్ది పనులు సైతంనిలిచిపోయాయి. పారిశుద్దం పూర్తిగా పడకేసింది. అధికార యంత్రాంగంమధ్యసమన్వయం లేకపోవడంతో ఎక్కడ ఎవరు ఏ పని చేస్తున్నారో అర్థం కావడంలేదు. మొత్తంగా నగర పాలన స్తంభించింది.ఉన్నతాధికారులు జోక్యం చేసుకునిఖమ్మం కార్పొరేషన్ పాలనను గాడిలో పెట్టాలని ఖమ్మం నగర ప్రజలుకోరుతున్నారు.

Related Stories: