మహిళా విజేత హిమాచల్

జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో హిమాచల్ ప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 3825 తేడాతో రైల్వేస్ జట్టును ఓడించింది. ప్రారంభం నుంచే హిమాచల్ ఆధిపత్యం చెలాయించింది. నిధి, పుష్ప అద్భుతంగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. హిమాచల్ దూకుడుగా ఆడుతూ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. ప్రథమార్ధంలో హిమాచల్ 1711 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా అదే […]

జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్

హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో హిమాచల్ ప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 3825 తేడాతో రైల్వేస్ జట్టును ఓడించింది. ప్రారంభం నుంచే హిమాచల్ ఆధిపత్యం చెలాయించింది. నిధి, పుష్ప అద్భుతంగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. హిమాచల్ దూకుడుగా ఆడుతూ ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. ప్రథమార్ధంలో హిమాచల్ 1711 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా అదే దూకుడును కొనసాగించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన హిమాచల్ 3825తో గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించింది. కాగా, పురుషుల విభాగంలో కర్నాటక జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్యానాను ఓడించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేత జట్లకు అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లట్, భారత కబడ్డీ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ మృదుల్ భాదూరియా ట్రోఫీని బహూకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాసాని జ్ఞానేశ్వర్, జగదీశ్వర్ యాదవ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: