సరికొత్త శిఖరాలకు..

 కొనుగోళ్ల జోరుతో 10,559 పాయింట్లకు నిఫ్టీ 34,153 పాయింట్ల వద్ద బిఎస్‌ఇ సూచీ ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతం శుక్రవారం సరికొత్త శిఖరాలను తాకాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్, రియాల్టీ స్టాక్స్ కౌంటర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 34,153 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు రోజుల […]

 కొనుగోళ్ల జోరుతో 10,559 పాయింట్లకు నిఫ్టీ
34,153 పాయింట్ల వద్ద బిఎస్‌ఇ సూచీ

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతం శుక్రవారం సరికొత్త శిఖరాలను తాకాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్, రియాల్టీ స్టాక్స్ కౌంటర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 34,153 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు రోజుల నష్టాల తర్వాత గురువారం జోరందుకున్న మార్కెట్లు వారాంతం లాభాల జోరును చూపాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 10,559 వద్ద స్థిరపడింది. ఇక రంగాల వారీగా చూస్తే పిఎస్‌యు బ్యాంక్స్ మాత్రమే 0.7 శాతం బలహీనపడగా, మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసిజి, ఆటో, రియల్టీ, ఫార్మా 1-0.7 శాతం మధ్య ఎగశాయి. గురువారం తాజా పెట్టుబడుల ఆకర్షణతో జోరందుకున్న ప్రభుత్వరంగ బ్యాంకులలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని, దీంతో ఈ కంపెనీల షేర్లు డీలా పడ్డాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రధాన కంపెనీల్లో యస్‌బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, ఇండస్‌ఇండ్, భారతీ, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ, టిసిఎస్‌లు లాభపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్, హిందాల్కొ, యుపిఎల్, హెచ్‌పిసిఎల్, ఐఒసి, ఒఎన్‌జిసి, సిప్లా, బిపిసిఎల్, విప్రో, ఐసిఐసిఐ నష్టాల్లో పయనించాయి. నగదు విభాగంలో గురువారం ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) రూ. 212 కోట్లు, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 325 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి.
34వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్
సెన్సెక్స్ కీలక 34000 పాయింట్ల మార్క్‌ను క్రాస్ చేసి మరింత ముందుకు సాగుతోంది. దేశీయ సేవల రంగం పుంజుకోవడం, మూలధన బాండ్లకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడం, అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందిన సానుకూల పవనాలు ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపర్చాయి. శుక్రవారం సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 34,021.27 వద్ద, నిఫ్టీ 10,534.25 వద్ద ప్రారంభమయ్యాయి.
10,550కు చేరిన నిఫ్టీ
వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నిఫ్టీ 10,550 స్థాయిని దాటింది. నిఫ్టీ సూచీ 10,563 వద్ద జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఇక మరో సూచీ 34,189 వద్దకు చేరింది. యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోరట్స్, ఇండస్ ఇండ్, ఏయిర్‌టెల్ షేర్లు 5 నుంచి 3శాతం లాభపడ్డాయి.
52 వారాల గరిష్ఠానికి ఎన్‌ఎండిసి
ప్రభుత్వరంగ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి)షేరు శుక్రవారం 52 -వారాల గరిష్టానికి చేరింది. ఎన్‌ఎస్‌ఇ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ఓ దశలో 3.59 శాతం పెరిగింది. ర్యాలీ చేసి 158.30 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది(2018)లో ఎన్‌ఎండిసి ఫైన్స్‌లూప్స్ ధరలు విశ్లేషకుల అంచనాలకు మించి పెంచింది. ప్రతి టన్ను ఏకంగా రూ.500లు పెంచుతున్నట్లు ఎన్‌ఎండిసి ప్రకటించింది.

Comments

comments

Related Stories: