స్వచ్ఛ్ సరేక్షణ్‌లో జగిత్యాలను ప్రథమ స్థానంలో నిలపాలి

జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి మనతెలంగాణ/జగిత్యాల: స్వచ్ఛ్ సర్వేక్షణ్ కా ర్యక్రమంలో జగిత్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలో నే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి అన్నా రు. శనివారం పట్టణంలోని 22వ వార్డులో శ్రీ లోకమాత సమ్ సమైఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ -2018 కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంఎల్‌ఎ ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాల మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలవాలంటే మహిళల […]

జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి
మనతెలంగాణ/జగిత్యాల: స్వచ్ఛ్ సర్వేక్షణ్ కా ర్యక్రమంలో జగిత్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలో నే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి అన్నా రు. శనివారం పట్టణంలోని 22వ వార్డులో శ్రీ లోకమాత సమ్ సమైఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ -2018 కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంఎల్‌ఎ ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాల మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలవాలంటే మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రతి ఇంటిని చక్కదిద్దే, కుటుంబ పరువు నిలబెట్టడం గృహిణి వల్లనే సాధ్యమవుతుందన్నారు. మహిళలతో పాటు మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది కూడా బాధ్యతగా ప ని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ముఖ్యం గా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వా డకం అనేక వ్యాధుల వ్యాప్తికి  కారణమవుతోందన్నారు.తడి,పొడి చెత్తను వేరు చేసి వీధుల్లోకి వ చ్చేమున్సిపల్ ఆటోలు,రిక్షాల్లో వేయాలన్నారు. చెత్తను వీధుల్లో, ము రికి కాల్వల్లో పడేయడం వల్ల ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారడ ంతో పాటు ఈగలు, దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల పాత్ర కీలకం కాబట్టి ఈ విషయమై మహిళల కు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసేందుకు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఇలాంటి అవగాహన సదస్సులను ప్రతి వార్డులో నిర్వహించి మహిళలను మరింత చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. మహిళా సంఘాలకు గత మూడు సంవత్సరాల నుంచి పావలా వడ్డీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం వడ్డీ చెల్లించకపోవడంతో కోట్లా ది రూపాయల వడ్డీ బకాయి పడిందని, దాంతో మహిళా సంఘాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బకాయిలు చెల్లింపుకు కృషి చేస్తానని జీవన్‌రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. గతంలో దివంగత ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చే యడం వల్లే పేద ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చి మహిళ సంఘాలకు రుణాలు ఇచ్చే వెసులుబాటు లభించిందన్నా రు. మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మిదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఇంటి వద్ద ఏ కొంచెం స్థలం ఉన్నా వంటింటి వ్యర్ధాలతో కంపోస్టు తయారు చేసుకోవచ్చన్నారు.
పారిశుద్ధ సంబంధిత సమస్యలకు ఇంటి వద్దనే తమ మొబైల్ ద్వారా పరిష్కారం పొందడానికి జగిత్యాల సిటిజన్ బడ్డి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. మన వీధిని శుభ్రంగా ఉంచుకుని మన వంతు బాధ్యతను నిర్వహించేందుకు వీధి ప్రజలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ క మిషనర్ సంపత్‌కుమార్, వార్డు కౌన్సిలర్ గాజుల రాజేందర్, టిఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, స్వచ్ఛ్ సర్వేక్షణ్ పర్యవేక్షకుడు ఖా దర్, సంబంధిత అధికారులు లచ్చిరెడ్డి, వెంకటరమణ,శ్రవణ్‌రెడ్డి, సబిత, సునీత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: