ప్రమాదమా….ఆత్మహత్యా…హత్యా..?

నవాబ్‌పేట్‌: మండల పరిదిలోని జంగమయ్యపల్లి గ్రామ సమీపంలో వున్న నవాబ్‌పేట్-కొందుర్గు రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా శెవరోలెట్ బీట్ కారు(TS08EU1120) దగ్దమై డైవర్ సీటులో వున్న వ్యక్తి పూర్తిగా కాలిపోయి అస్తిపంజరం మాత్రమే మిగిలిన సంఘటన సంచలనం సృష్టించింది.విషయం తెలుసుకున్న డీఎస్పీ భాస్కర్,రూరల్ సీఐ పార్థసారథి,ఎస్సై ప్రవీణ్‌కుమార్‌లు బుధవారం తెల్లవారు జామున సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించగా కొందుర్గు నుండి నవాబుపేట వైపు రోడ్డు ప్రక్కకు అగివున్న కారును పరిశీలిస్తే ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి […]

నవాబ్‌పేట్‌: మండల పరిదిలోని జంగమయ్యపల్లి గ్రామ సమీపంలో వున్న నవాబ్‌పేట్-కొందుర్గు రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా శెవరోలెట్ బీట్ కారు(TS08EU1120) దగ్దమై డైవర్ సీటులో వున్న వ్యక్తి పూర్తిగా కాలిపోయి అస్తిపంజరం మాత్రమే మిగిలిన సంఘటన సంచలనం సృష్టించింది.విషయం తెలుసుకున్న డీఎస్పీ భాస్కర్,రూరల్ సీఐ పార్థసారథి,ఎస్సై ప్రవీణ్‌కుమార్‌లు బుధవారం తెల్లవారు జామున సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించగా కొందుర్గు నుండి నవాబుపేట వైపు రోడ్డు ప్రక్కకు అగివున్న కారును పరిశీలిస్తే ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి అందులో వున్న వ్యక్తి చనిపోయాడా..? లేక అతనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా.?? లేదా ఎవ్వరైనా చంపేసి తగులబెట్టారా?? అన్న అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రమాదానికి గురైన కారు కొడంగల్ మండలం ఇందనూరు గ్రామానికి చెందిన,ప్రస్తుతం హన్వాడ మండలం మునిమోక్షం గ్రామం ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శాంతికుమార్ కు చెందినదని గుర్తించడంతో మృతుడు అతనేనా.??లేదా మరెవరో అన్న సందేహాలు వెల్లువెత్తడంతో సదరు ఉపాధ్యాయుడి గతాన్ని తోడటంతో ఆసక్తికరమైన విషయాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.సదరు ఉపాధ్యాయుడికి ముగ్గురు భార్యలని వారిలో ఇదివరకే ఇద్దరికి విడాకులిచ్చి మరొక మహిళతో వుంటున్నాడని,ఆత్మహత్యకు పాల్పడే ధైర్యం అతనికి లేదని కొందుర్గు మండలం ఐతాపూర్ తాండాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడి మొదటి భార్య రజిని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పేర్కోనడం,ఈనెల 21వతెదీన పాఠశాలకు సెలవుపెట్టి వెళ్లిన ఉపాధ్యాయుడు తన భార్య దగ్గరకు వెళ్లి తర్వాత కనబడకుండా పోవడం,దగ్దమైన కారు ఉపాధ్యాయుడిదే లాంటి విషయాలు గమనిస్తే కఛ్చితంగా మృతిచెందిన వ్యక్తి ఖచ్చితంగా ఉపాధ్యాయుడు శాంతికుమారేనని పలువురు భావిస్తున్నారు.కాగా మృతుడిగి ముగ్గురి భార్యల ఘన చరిత్ర వున్నందున కారు దగ్ధం సంఘటనపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.గత కొన్ని రోజులక్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగర్‌కర్నూల్ స్వాతి-సుధాకర్‌రెడ్డిల కేసును మరువక ముందే అలాంటి మరోక మిస్టరీ కేసు నవాబ్‌పేటలో చోటుచేసుకోవడం విశేషం.కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే కఛ్చితంగా కారుదగ్దం ప్రమాదవశాత్తు జరగలేదని,ఎవరో చంపేసి కారులో పడేసి నిర్జన ప్రదేశంలో దగ్దం చేసి ప్రమాదవశాత్తు జరిగినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.విషయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించి,సదరు ఉపాధ్యాయుడి బంధువులను పిలిపించి విచారణ చేపట్టారు.కాగా ప్రమాదవశాత్తు జరిగనట్లుగా పరిస్థితి అర్థమవుతుండటంతో మృతుడు శాంతికుమారా? లేదా మరొకరా? ఎవరైన చంపేసి కారులో పడేసి దగ్దం చేశారా? ఎవరు చంపివుంటారు? సంఘటనకు మృతుడి భార్యల కుటుంబసభ్యులకు ఏమైనా సంబంధం వుందా?సంఘటన వెనుక తన భర్త మరో స్త్రీతో వుండటం భరించలేని భార్యలున్నారా? లాంటి విభిన్న కోణాలతో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటనా స్థలంలోనే శవ పంచనామా,పోస్ట్‌మార్టం నిర్వహించి నమూనాలను ఫోరెన్సిస్ ట్యాబ్‌కు పంపించారు. కేసుపై పూర్తి విచారణ జరిపి నిజానిజాలు త్వరలో బయటపెడతామని పోలీసులు పేర్కోంటున్నారు.ఏదిఏమైనా గత కొన్ని రోజులుగా సరికొత్త మిష్టరీ హత్యలు,సంఘటనలు నవాబ్‌పేట మండలంలో చోటు చేసుకోవడం విశేషం.

Comments

comments

Related Stories: