వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి

 మన తెలంగాణ/పంజాగుట్ట: సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఏర్పాటు చేసిన టిడిపి జిమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల, పరుగుల నగర జీవితంలో వివిధ రకాల ఆనారోగ్యాల భారిన పడకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానం తప్పకుండా చేయాలని అన్నారు. ప్రతి రోజు ఎంతో సమయాన్ని వృధా చేసే వారు వ్యాయామానికి మాత్రం […]

 మన తెలంగాణ/పంజాగుట్ట: సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఏర్పాటు చేసిన టిడిపి జిమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల, పరుగుల నగర జీవితంలో వివిధ రకాల ఆనారోగ్యాల భారిన పడకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానం తప్పకుండా చేయాలని అన్నారు. ప్రతి రోజు ఎంతో సమయాన్ని వృధా చేసే వారు వ్యాయామానికి మాత్రం టైమ్ లేదని చెప్పడం అబద్దం అవుతుందని అన్నారు. వ్యక్తిగత జీవితం కోసం సమయం కేటాయించలేని వారు భవిష్యత్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. శీతాకాలం వ్యాయామానికి మరింత అనుకూలమైన సమయమని అన్నారు. జిమ్ నిర్వాహకులు దినేష్ పాల్గొన్నారు.

Related Stories: