క్షణికావేశం ఖరీదు మూడు ప్రాణాలు

మన తెలంగాణ/నవాబ్‌పేట్: భర్త అక్రమ సంబంధం బయట పడడంతో కలత చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి  ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొండాపూ ర్‌లో విషాదం నింపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెం దిన వడ్డె సత్యయ్యకు పదేళ్ల క్రితం పోమాల గ్రామానికి చెందిన యశోదతో వివా హమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు సంతానం. కొన్ని నెలలుగా సత్యయ్య మరో […]

మన తెలంగాణ/నవాబ్‌పేట్: భర్త అక్రమ సంబంధం బయట పడడంతో కలత చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి  ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొండాపూ ర్‌లో విషాదం నింపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెం దిన వడ్డె సత్యయ్యకు పదేళ్ల క్రితం పోమాల గ్రామానికి చెందిన యశోదతో వివా హమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు సంతానం. కొన్ని నెలలుగా సత్యయ్య మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త సత్యయ్య పరాయి స్త్రీ మోజులో పడి ఇంటికి రావడమే మానేశాడు. మంగళవారం రాత్రి ఇంటికి చేకున్న అతడిని భార్య నిలదీయగా అ దే విషయంపై ఇరువురు తీవ్రంగా గొడవపడ్డారు. భర్త ప్రవర్తనతో విసుగుచెందిన యశోద బుధవారం ఉదయం కొడుకు ఆంజనేయులు (8), కుమార్తె భాగ్యలక్ష్మి (6)ని తీసుకొని వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అక్కడ బావిలో దూకి ఆత్మ హత్యకు పాల్పడింది.  ఇది గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ మృతదేహాలను బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related Stories: