‘2 కంట్రీస్’ సెన్సార్ పూర్తి

దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మి ఆర్ట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘2 కంట్రీస్’. మనీషారాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయనున్నారు. మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న ‘2 కంట్రీస్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. చిత్ర దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ “అధిక శాతం అమెరికాలో షూటింగ్ […]

దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మి ఆర్ట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘2 కంట్రీస్’. మనీషారాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయనున్నారు. మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న ‘2 కంట్రీస్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. చిత్ర దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ “అధిక శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ‘2 కంట్రీస్’ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కింది. సునీల్ కామెడీ టైమింగ్, స్టోరీ హైలైట్స్‌గా ఈ చిత్రం రూపొందింది. అలాగే పృథ్వీ, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇక గోపీసుందర్ ఆర్.ఆర్. సినిమాలోని ఎమోషన్స్‌ను హైలైట్ చేస్తుంది. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా మా చిత్రం విడుదలకానుంది”అని అన్నారు. నరేష్, షాయాజీ షిండే, దేవ్ గిల్, కృష్ణభగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సితార తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః సి.రాంప్రసాద్, సంగీతంః గోపీసుందర్, ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, కళః ఎ.ఎస్.ప్రకాష్.