నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

మనతెలంగాణ-నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ లోని కడప జిల్లా , పులివెందులకు చెందిన వెంకటరెడ్డి-సుబ్బలక్ష్మి దంపతులు బ్రతుకు దెరువు కోసం స్థానిక క్వారీలో పని చేసేందుకు వచ్చారు. గత 15 రోజుల క్రితం ఖమ్మం జిల్లా లోని నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంకు వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శనివారం తల్లి సుబ్బలక్ష్మి నిద్రిస్తుండుగా చిన్నారి భావ్యాంజ్ఞా(11)నెలలు పాప […]


మనతెలంగాణ-నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ లోని కడప జిల్లా , పులివెందులకు చెందిన వెంకటరెడ్డి-సుబ్బలక్ష్మి దంపతులు బ్రతుకు దెరువు కోసం స్థానిక క్వారీలో పని చేసేందుకు వచ్చారు. గత 15 రోజుల క్రితం ఖమ్మం జిల్లా లోని నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంకు వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శనివారం తల్లి సుబ్బలక్ష్మి నిద్రిస్తుండుగా చిన్నారి భావ్యాంజ్ఞా(11)నెలలు పాప ఆడలాడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందింది. తల్లి సుబ్బలక్ష్మి చూసే సరికి చిన్నారి నీటి తొట్టిలో శవమై కనిపించింది. మృతదేహాం వద్ధ పడి రోధిస్తున్న తీరు అందరిని కంట తడిపెట్టించింది. స్థానికులు చిన్నారి మృతదేహాంను చూసి కన్నీరు మున్నీరు గా విలపించారు.

Comments

comments

Related Stories: