పోలవరాన్ని సందర్శించిన పవన్

                        ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ పశ్చమ గోదావరి జిల్లాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాజమండ్రి నుంచి పవన్ కారులో పోలవరం చేరుకున్నారు. అక్కడి అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ ఉన్న గుట్టలపై నుంచి పోలవరం ప్రాజెక్టును పవన్ పరిశీలించారు. పోలవరం వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అభిమానులు అరుపులతో […]

                       

ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ పశ్చమ గోదావరి జిల్లాలో నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాజమండ్రి నుంచి పవన్ కారులో పోలవరం చేరుకున్నారు. అక్కడి అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ ఉన్న గుట్టలపై నుంచి పోలవరం ప్రాజెక్టును పవన్ పరిశీలించారు. పోలవరం వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అభిమానులు అరుపులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. సిఎం, సిఎం అంటూ గట్టిగా అరవడంతో పవన్ అసంతృప్తికి గురయ్యారు. ఇక్కడికి పనిమీద వచ్చానని  నినాదాలు చేయోద్దని అభిమానులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Comments

comments

Related Stories: