2018 నాటికి 6.5 శాతానికి జిడిపి వృద్ధి రేటు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 6.5 శాతానికి పెరిగే అవకాశముందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అంచనా వేశారు. గత మూడేళ్లుగా స్థూల ఆర్థిక సూచీలు నిలకడగానే ఉన్నాయని,  కరెంట్ ఖాతా లోటు స్వల్పంగా ఒక శాతం పెరగ్గా, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని అన్నారు. జిఎస్‌టి అమలు చేసిన తర్వాత కొంత మందగమన పరిస్థితులు ఏర్పడినాయని, అందువల్లే అంతకముందు జిడిపి 5.7 శాతానికి పడిపోయిందని అన్నారు. ఇప్పుడు […]

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 6.5 శాతానికి పెరిగే అవకాశముందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అంచనా వేశారు. గత మూడేళ్లుగా స్థూల ఆర్థిక సూచీలు నిలకడగానే ఉన్నాయని,  కరెంట్ ఖాతా లోటు స్వల్పంగా ఒక శాతం పెరగ్గా, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని అన్నారు. జిఎస్‌టి అమలు చేసిన తర్వాత కొంత మందగమన పరిస్థితులు ఏర్పడినాయని, అందువల్లే అంతకముందు జిడిపి 5.7 శాతానికి పడిపోయిందని అన్నారు. ఇప్పుడు జిడిపి 6.3 శాతంతో పుంజుకుంటోందని అన్నారు.  రాబోయే రోజుల్లో 2017-18 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 6.5 శాతం, అంతకన్నా ఎక్కువ నమోదు కావచ్చని అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధిరేటు 8 శాతానికి చేరుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదికను అంచనాను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వరుసగా ఐదు త్రైమాసికాల పాటు తగ్గుతూ వచ్చిన జిడిపి రెండో త్రైమాసికంలో పెరిగింది. జులై-సెప్టెంబరు త్రైమాసికానికి 6.3  చేరింది. కేంద్ర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్ మరింత జనరంజకంగా ఉంటుందని అన్నారు.

Comments

comments

Related Stories: