రాఫెల్‌పై విమర్శలు తగదు

ఢిల్లీ : రాఫెల్ ఫైటర్ జెట్‌ల కొనుగోలుపై కాంగ్రెస్ విమర్శలు చేయడంపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 36 ఫైటర్ జెట్‌ల కొనుగోలు వ్యవహారంపై వస్తున్న విమర్శలను ఆమె కొట్టి పారేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేయడంపై ఆమె మండిపడ్డారు. ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు భద్రతా బలగాలకు హానీ చేస్తాయని […]

ఢిల్లీ : రాఫెల్ ఫైటర్ జెట్‌ల కొనుగోలుపై కాంగ్రెస్ విమర్శలు చేయడంపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 36 ఫైటర్ జెట్‌ల కొనుగోలు వ్యవహారంపై వస్తున్న విమర్శలను ఆమె కొట్టి పారేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేయడంపై ఆమె మండిపడ్డారు. ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు భద్రతా బలగాలకు హానీ చేస్తాయని ఆమె పేర్కొన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ జెట్ల కొనుగోలుకు సంబంధించి ఐదు సార్లు కీలక చర్చలు జరిగాయని, ఈ క్రమంలో 2016 సెప్టెంబరులో ఒప్పందం కుదిరిందని ఆమె వెల్లడించారు. వాయుసేన దళాల సంసిద్ధత అంశంలో యుపిఎ ప్రభుత్వం ఎంతటి నిర్లక్షంగా వ్యవహరించిందో దేశ ప్రజలకు తెలిసిన విషయమేనని ఆమె పేర్కొన్నారు.

Does not make criticism on Rafael

Comments

comments

Related Stories: