తెలంగాణ తెలుగు కీర్తిని ఎలుగెత్తి చాటుదాం

*మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియల ప్రదర్శనలు జరగాలి *అన్నింటా ఉద్ధండులైన ఎంతోమంది తెలంగాణ బిడ్డలు విశేష కృషి చేశారు *ప్రపంచ నలుమూలల నుంచి పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు పాల్గొంటారు *నిరక్షరాస్యులు కూడా బతుకమ్మ వంటి పాటల ద్వారా జానపద పరంపర కొనసాగించారు *మహాసభల్లో ఈ ఘనతను చాటాలి ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సమీక్షలో సిఎం కెసిఆర్ ఉద్ఘాటన  హైదరాబాద్ : తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా […]

*మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియల
ప్రదర్శనలు జరగాలి
*అన్నింటా ఉద్ధండులైన ఎంతోమంది
తెలంగాణ బిడ్డలు విశేష కృషి చేశారు
*ప్రపంచ నలుమూలల నుంచి పండితులు,
తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు,
రచయితలు పాల్గొంటారు
*నిరక్షరాస్యులు కూడా బతుకమ్మ వంటి
పాటల ద్వారా జానపద పరంపర
కొనసాగించారు
*మహాసభల్లో ఈ ఘనతను చాటాలి

ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సమీక్షలో సిఎం కెసిఆర్ ఉద్ఘాటన 

హైదరాబాద్ : తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. మహా సభల్లో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికి సంబంధించిన ప్రదర్శనలు జరగాలన్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ‘పద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహి త్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్ధండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారు. వారందరిని స్మరించుకోవాలి. వారు తెలుగు భాష కోసం చేసిన కృషిని చాటి చెప్పాలి. తెలంగాణలో వెలుగొందుతున్న భాషా ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి. వందల ఏళ్ల నుం చి తెలంగాణలో తెలుగు భాష వర్ధిల్లుతూ వస్తున్నదని, అనేక మంది పండితులు, కవులు, రచయితలే కాకుండా నిరక్షరాస్యులు కూడా బతుకమ్మ వంటి పాట ద్వారా జానపద పరంపర కొనసాగించారు. ఈ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు తెలుగు మహాసభలు ఉపయోగపడాలి. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలి. ప్రతిరోజు సాయంత్రం ఎల్‌బి స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి” అని సిఎం దిశా నిర్దేశం చేశారు.
“ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయి. దేశంలోని చాలా రా్రష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు, సంఘాలున్నాయి. దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతోపాటు చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగు వారున్నారు. వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అమెరికా, వివిధ దేశాలు, ఆంధ్రప్రదేశ్‌తో సహా తెలుగువారున్న రాష్ట్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలని సిఎం సూచించారు. మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో విస్తృత ఏర్పాట్లు చేయాలి. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతి చోట వినిపించాలి. ప్రతి ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలి. ఎక్కడేం జరుగుతుం దో అందరికీ తెలియడానికి విస్తృత ప్రచారం కల్పించాలి. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హెచ్‌ఎండబ్లు, ఎస్‌ఎస్‌బి సమన్వయంతో పనిచేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్ డ్యూటీ మీద సభలకు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించాలని సిఎం కెసిఆర్ చెప్పారు.

Comments

comments

Related Stories: