రూ.1250 కోట్ల ఎంఒయులు

ఢిల్లీలో మంత్రి కెటిఆర్ సమక్షంలో కుదిరిన 9 పెట్టుబడుల ఒప్పందాలు న్యూఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2017లో రెండో రోజు అయిన శనివారం తొమ్మిది సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నది. సుమారు 1250 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలను కుదుర్చుకున్నది. మంత్రి కెటిఆర్ సమక్షంలో ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖా కార్యదర్శి జయేశ్ రంజాన్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లో బికానీర్ వాలా, ప్రయాగ్ న్యూట్రీ […]

ఢిల్లీలో మంత్రి కెటిఆర్ సమక్షంలో కుదిరిన 9 పెట్టుబడుల ఒప్పందాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2017లో రెండో రోజు అయిన శనివారం తొమ్మిది సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నది. సుమారు 1250 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలను కుదుర్చుకున్నది. మంత్రి కెటిఆర్ సమక్షంలో ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖా కార్యదర్శి జయేశ్ రంజాన్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లో బికానీర్ వాలా, ప్రయాగ్ న్యూట్రీ మేన్స్ ఫుడ్స్, కనోరియ గ్రూప్ కు చెందిన అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బెకరీ, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీం లైన్ డైరీ, పుష్య ఫుడ్స్ సంస్థలున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందాల ద్వారా సుమారు 38 00 మందికి నేరుగా ఉద్యోగావకాశాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలున్నాయని తెలిపారు. శుక్రవారం, శనివారం రెండు రోజులు కుదుర్చుకున్న ఒప్పందాలతో మొత్తం 10 వేల మందికి ప్రత్య క్ష ఉపాధి లభిస్తుందన్నారు. దీంతోపాటు 45 వేల మంది రైతులకు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మెళకువలు నేర్పనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీ అవిష్కరించిన మంత్రి కెటి రామారావు :తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీని శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండి యా – 2017 కార్యక్రమంలోఆవిష్కరించారు. తెలంగాణలో ఉన్న విస్తృతమైన ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ పాలసీ దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు. పాలసీ ఆవిష్కరణ సందర్భంగా విజ్ఞాన్ భవన్ లో జరిగిన సమావేశానికి హాజరైన పారిశ్రామిక వేత్తలను ఉధ్దేశించి మంత్రి ప్రసంగించారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ పాలసీ లక్షంగా పేర్కొన్నారు. ఫుడ్ ప్రొసెసింగ్ రంగాన్నివ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి, రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని అందుకునేలా ఈ పాలసీ రూపొందించామన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణి, గొర్రెల పంపిణి కార్యక్రమాలను ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అనుసంధానం చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచుతామన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు, గొర్రెల పెంపకం (లైవ్ స్టాక్) లో రాబోయే ఐదేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారేందుకు ఈ పాలసీ సహకరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా ఉన్న అను కూలతల వలన దేశ ఆహారోత్పత్తుల రవాణా హబ్‌గా మారుస్తామన్నారు. ఈ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీ ద్వారా సుమారు 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రావడంతోపాటు లక్ష 25 వేల మందికి ఉద్యో గాలు లభిస్తాయన్నారు. ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమ ద్వారా వ్యవసాయ ఆహార ఉత్పత్తుల నాణ్యతలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిపుతా మని మంత్రి తెలిపారు.
దీంతో పాటూ అగ్రి, ఫుడ్ వాల్యూ చైన్ నిర్మించడమే లక్షంగా పని చేస్తా మని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చే వారికి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇచ్చేటటువంటి సిబ్సిడీలను, ప్యాకేజీ వివరాలను తమ కందిస్తే అంతకు మించిన అవకాశాన్ని తాము కల్పిస్తామని పెట్టు బడిదారులకు మంత్రి భరసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను మంత్రి వారికి వివరిం చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పుడ్ ప్రొసెసింగ్ రంగంలోని అవకా శాలను మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం రంగం మరింత అభివద్ది చెందుతుందన్న మంత్రి, వ్యసాయానుబంధంగా చేపట్టిన కార్యక్రమాలను సైతం వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో వ్యవసాయోత్ప్తతుల స్టోరేజీ సామర్ద్యాన్ని ఎన్నో రెట్టు పెంచినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా ఆ రంగంలోని పెట్టుబడి దారులకు అందించే రాయితీలు పాలసీలోని ముఖ్యాంశాలను వివరించారు.

పాలసీ ముఖ్యాంశాలు
* ఈ పాలసీ వచ్చే ఐదేళ్లు అమలులో ఉంటుంది
*రాబోయే ఐదేళ్లలో 20 వేల కోట్ల పెట్టుబ్డులు రాష్ట్రంలోకి వస్తాయి.
* లక్షా 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు
*రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు
*ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెలు, చేపల పెంపకం వంటి కార్యక్రామాలు ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమతో అనుసంధానం
* ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వ్యవసాయ – ఆహార ఉత్పత్తుల వాల్యూ చైన్ ఏర్పాటు
* ఇందుకోసం ఫుడ్ ప్రొసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్క్ ల అభివృద్ధి
* సగటు ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిని కనీసం 20 శాతం పెంచడం
* జాతీయ స్థాయిలో నాణ్యమైన వవసాయ ఉత్పత్తుల కేంద్రంగా తెలంగాణను మార్చడం
* ఈ పాలసీలో భాగంగా స్టార్ట్ అప్స్ కోసం అగ్రి టెక్ నిధి ఏర్పాటు
*ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్, ఆదర్శ విధానాల ప్రమోషన్

Related Stories: