బంగారం ధర పతనం

ముంబయి: దీపావళికి ముందు పరుగులు పెట్టిన బంగారం ధర మళ్లీ దిగివస్తోంది. వరుసగా మూడో రోజు ధర పడిపోయింది. పది గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.30,450కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జా తీయంగా బంగారం ధర 0.41శాతం తగ్గడంతో ఔన్సు 1,274.80 డాలర్లు గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో […]

ముంబయి: దీపావళికి ముందు పరుగులు పెట్టిన బంగారం ధర మళ్లీ దిగివస్తోంది. వరుసగా మూడో రోజు ధర పడిపోయింది. పది గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.30,450కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జా తీయంగా బంగారం ధర 0.41శాతం తగ్గడంతో ఔన్సు 1,274.80 డాలర్లు గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.50 పెరిగి రూ.40,900కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో వెండి ధర స్వల్పంగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Related Stories: