బాలయ్య 102వ చిత్రం టైటిల్ ఫిక్స్

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ఒ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య నటిస్తున్న 102వ చిత్రం.ఈ సినిమాలో బాలయ్యుకు జోడీగా నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై సి.కళ్యాణ్ నర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్‌పై రకరకాల వార్తలు వినిపించాయి. ఇటీవల ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. కానీ, తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘జైసింహా’ అనే […]


హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ఒ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య నటిస్తున్న 102వ చిత్రం.ఈ సినిమాలో బాలయ్యుకు జోడీగా నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు నటిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై సి.కళ్యాణ్ నర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్‌పై రకరకాల వార్తలు వినిపించాయి. ఇటీవల ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. కానీ, తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘జైసింహా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గతంలో బాలకృష్ణ నటించిన ‘సింహా’కు ‘జైసింహా’ దగ్గరగా ఉండటంతో పాటు పవర్‌ఫుల్‌గా కూడా ఉంటుందని చిత్ర బృందం భావిస్తున్నారట.త్వరలోనే టైటిల్ లోగో పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలె క్లైమాక్స్ పార్ట్‌ను , కీలక యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

Related Stories: