టెన్షన్ పెంచిన పెన్షన్ విధానం

కొత్త పెన్షన్ విధానంలో ఉన్న అతి పెద్ద ప్రమాదకర అంశం ప్రభుత్వానికి, సిబ్బందికి మధ్య ఫండ్ మేనేజర్లు చొరబడి ఇరువురి నుండి ప్రతి నెలా జీత భత్యాలలో 10 శాతం వాటాలు వసూలు చేసి వాటితో జూదమాడి ఉద్యోగులను ధనవంతులను చేస్తామని చెప్పడం. జూదంలో గెలుపోటముల రెండూ వుంటాయి. కొద్ది మంది గెలుస్తారు. చాలా మంది ఓడిపోతారు. జీవనాధారమైన రొక్కంతో జూదమాడడం నేరంగా భావించబడుతుంది. నేరం ఐనా, కాకపోయినా మెజారిటీ ఉద్యోగులు తమ జీవనం నరక ప్రాయమవుతుందని […]

కొత్త పెన్షన్ విధానంలో ఉన్న అతి పెద్ద ప్రమాదకర అంశం ప్రభుత్వానికి, సిబ్బందికి మధ్య ఫండ్ మేనేజర్లు చొరబడి ఇరువురి నుండి ప్రతి నెలా జీత భత్యాలలో 10 శాతం వాటాలు వసూలు చేసి వాటితో జూదమాడి
ఉద్యోగులను ధనవంతులను చేస్తామని చెప్పడం. జూదంలో గెలుపోటముల రెండూ వుంటాయి. కొద్ది మంది గెలుస్తారు. చాలా మంది ఓడిపోతారు. జీవనాధారమైన రొక్కంతో జూదమాడడం నేరంగా భావించబడుతుంది. నేరం ఐనా, కాకపోయినా మెజారిటీ ఉద్యోగులు తమ జీవనం నరక ప్రాయమవుతుందని భయపడుతున్నారు. నూతన విధానంతో ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుందని నమ్మబలికి ఇందులోకి దించారు. వాస్తవంగా ఈ విధానం ద్వారా ప్రభుత్వాలు కోట్లాది రూపాయల పెన్షన్ నిధులను శాశ్వతంగా స్టాక్ మార్కెట్లకు
సమర్పించుకొంటాయి. పాత విధానంలో ఒక్క రూపాయి కూడా బయటకుపోకుండా, ప్రభుత్వమే పెన్షన్ ఫండ్ నిర్వహించి, రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యూటీ, కమ్యూటేషన్ విలువలను ఏక మొత్తంగా చెల్లించి, మిగిలిన ఫండ్‌ను తన అధీనంలోనే నిర్వహించే అవకాశం ఉన్నది.

పెన్షన్ ఏక మొత్తం నగదు చెల్లింపు రూపంలో ఎంత వచ్చినా నిలబడదు. జీవితాంతం రెగ్యులర్ పెన్షన్
లేకపోతే ఆ ఉద్యోగి జీవితం దుర్భరమవుతుంది. ఇది కొత్త విధానంలోని అతి పెద్ద మైనస్ పాయింట్. రెండు స్కీముల మధ్య తారతమ్యము చాలా ఉన్నది. పాత విధానంలో ఉద్యోగుల జీవితం చివరి దాకా పెన్షన్
అందిస్తుంది. కొత్త స్కీము జూద స్వభావం కలిగినది. లాభం రావచ్చును లేక నిండా మునగవచ్చును. జీవన
భద్రతకు పనికి రాదు. పాత విధానంలో పెన్షన్ నిధులు మొదటి నుండి చివరి దాకా ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. కేవలం పెన్షన్ చెల్లింపు వరకు మాత్రమే ఉద్యోగికి వాటిపై హక్కు ఉంటుంది. ఆ చెల్లింపుల తర్వాత ప్రభుత్వ నిధులలో కలుపుకోవచ్చును. ప్రభుత్వంపై ఎటువంటి భారం పడదు. దీనిని పెన్షన్ ట్రస్టుగా
భావించవచ్చును. అసలు ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. లేక పెరుగుతుంది. కొత్త స్కీములో ప్రతి నెలా నిధులు ఫండ్ మేనేజర్లకు చేరుతాయి. ప్రభుత్వానికి ఏ అధికారం ఉండదు. దీర్ఘ కాంలో వేల కోట్ల రూపాయలు
బయటకిపోతాయి. కనుక ఉభయులకు లాభదాయకమైన పాత పెన్షను విధానాన్ని రాష్ట్ర పెన్షన్ విధానంగా
ప్రకటించి ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చాలి

కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1 నుండి అమల్లోకి తెచ్చిన నూతన పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఉమ్మడి రాష్ట్రం) 2004 సెప్టెంబర్ 1 నుండి నియమితులైన ఉద్యోగులకు వర్తింప చేస్తున్నది.
అప్పటి నుండి నూతన విధానం వద్దనీ, పాత విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న సెప్టెంబర్ మొదటి తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు.
నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో మిత్రుడుగా వ్యవహరిస్తానని చాలా సార్లు ప్రకటించింది. కొత్త రాష్ట్రంగా తెలంగాణకు తన సొంత పింఛను విధానము ఎంచుకొనే అధికారం ఉన్నది. అలా ఎంచుకొనే ముందు ఉద్యోగులకు జీవన భద్రతతోపాటు ప్రభుత్వంపై నిధుల భారం అదనంగా పడకుండా ఉండేటట్లు చూసుకోవడమూ తప్పనిసరి.
పెన్షన్ దయతో వేసే భిక్ష కాదనీ, వాయిదా వేయబడిన జీతంలోని భాగాన్ని ఉద్యోగానంతరం చెల్లించడమే”నన్న సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆ అభిప్రాయం పాత పెన్షన్ విధానానికి సరిగ్గా సరిపోతుంది. ఉద్యోగి కంట్రిబ్యూషన్ లేకుండానే ప్రభుత్వం చెల్లించే 9.5 శాతం స్కేలు గరిష్ఠ కంట్రిబ్యూషన్‌తో ఏర్పరచిన ఫండ్ తోనే అప్పటి దాకా పెన్షన్ చెల్లింపులు జరిగాయి. అదే న్యాయ బద్ధం.
కొత్త పెన్షన్ విధానంలో ఉన్న అతి పెద్ద ప్రమాదకర అంశం ప్రభుత్వానికి, సిబ్బందికి మధ్య ఫండ్ మేనేజర్లు చొరబడి ఇరువురి నుండి ప్రతి నెలా జీత భత్యాలలో 10 శాతం వాటాలు వసూలు చేసి వాటితో జూద మాడి ఉద్యోగులను ధనవంతులను చేస్తామని చెప్పడం. జూదంలో గెలుపోటముల రెండూ వుంటాయి. కొద్ది మంది గెలుస్తారు. చాలా మంది ఓడిపోతారు. జీవనాధారమైన రొక్కంతో జూదమాడడం నేరంగా భావించబడుతుంది. నేరంఐనా, కాకపోయినా మెజారిటీ ఉద్యోగుల జీవనం నరక ప్రాయమవుతుందని భయపడుతున్నారు.
నూతన విధానంతో ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుందని నమ్మబలికి ఇందులోకి దించారు. వాస్తవంగా ఈ విధానం ద్వారా ప్రభుత్వాలు కోట్లాది రూపాలయ పెన్షన్ నిధులను శాశ్వతంగా స్టాక్ మార్కెట్లకు సమర్పించుకొంటాయి. పాత విధానంలో ఒక్క రూపాయి కూడా బయటకుపోకుండా, ప్రభుత్వమే పెన్షన్ ఫండ్ నిర్వహించి, రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యూటీ, కమ్యూటేషన్ విలువలను ఏక మొత్తంగా చెల్లించి, మిగిలిన ఫండ్‌ను తన అధీనంలోనే నిర్వహించే అవకాశం ఉన్నది. మిగిలిన ఫండ్‌పై వచ్చే వడ్డీతో పెన్షన్, కుటుంబ పెన్షన్ చెల్లించిన తర్వాత మిగిలిపోయిన పెన్షన్ నిధి ప్రభుత్వానికే చెందుతుంది. ఈ మొత్తం సక్రమంగా నిర్వహించినప్పుడు సేవింగ్స్‌గా మారి, పెన్షన్ చెల్లింపులకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ మొత్తం ప్రభుత్వ నిధికి తిరిగి వస్తుంది.
పాత విధానంలో ఒక జూనియర్ అసిస్టెంట్ 2009-10 లో నియామకం జరిగి (8 సం॥) స్కేలు. ఎస్‌పిపిఐ (16 సం॥) ఎస్‌పిపి 2(24 సం॥) స్కేల్ పొంది 33 సంవత్సరాలకు రిటైరయినప్పుడు, వేతన స్కేళ్లపై 9.5 శాతం పెన్షన్‌ను కంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ నాటికి రూ. 88,09,187- అతని ఖాతాలో నిల్వ ఉంటుంది. అలాగే అతని వేతనం రిటైర్మెంట్ నాటికి రూ. 47,330/- ఉంటుంది. ఆ వేతనంపై అతనికి లభించే పెన్షన్, గ్యాట్యూటీ కమ్యుటేషను విలువ చెల్లించిన తర్వాత అతని పెన్షను నిధి నిల్వలో రూ. 66,58,308/- మిగులు ఉంటుంది. ఈ బ్యాలెన్స్‌పై వడ్డీ మొదటి నెల రూ. 47163/- లభిస్తుంది. చెల్లించాల్సిన పెన్షన్ రూ. 14199/- మాత్రమే వుండి రూ. 32964 బ్యాలెన్స్ మిగులుతుంది.
ఈ తేడా ప్రతి నెలా పెరుగుతూ 5 సం॥ రాల తర్వాత బ్యాలెన్స్ రూ. 9112180/- ఉంటుంది. అతని ఖాతా నిల్వపై వచ్చే వడ్డీ కంటే చెల్లించే పెన్షన్ చాలా తక్కువగా ఉన్నందున, మిగులు అధికంగా ఉంటుంది. ఉద్యోగి తర్వాత కుటుంబ పెన్షన్ పూర్తయ్యేటప్పుటికి చాలా పెద్ద మొత్తము నిల్వ ఉంటుంది. కుటుంబ పెన్షన్ చెల్లింపు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి మొదట సర్వీసు కాలములో చెల్లించిన కంట్రిబ్యూషన్, వడ్డీ అన్ని కలసిన మొత్తానికి రెండింతలు జమవుతాయి. 33 సం॥రాలు సర్వీసు కాలం, తదనంతరం మరో 30 ఏళ్లు మొత్తం 63 సం॥రాల ప్రక్రియ. ఐతే ఇది నిరంతర ప్రక్రియ. కనుక అందరు ఉద్యోగుల కంట్రిబ్యూషన్లు వడ్డీలు కూడా తిరిగి లాభంతో వస్తాయి. కనుక చెల్లించిన పెన్షన్లు ప్రభుత్వానికి ఏవిధమైన భారం కలిగించవు.
దీనితోపాటు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ 6 శాతంకు తగ్గకుండా జమ చేయాలని నిబంధన ఉంది. దానిని 10 శాతం కనీస మొత్తంగా మార్చి జమ చేస్తే, పైన పేర్కొన్న జూనియర్ అసిస్టెంట్ సర్వీసు పూర్తయ్యే (33సం॥)నాటికి ఆ ఉద్యోగికంట్రిబ్యూషన్ కింద రూ. 10,28,436 /- జమ అవుతాయి. దానికి 8.5 శాతం వడ్డీ లెక్కిస్తే రూ. 22,78,343/- లభిస్తుంది. మొత్తం రూ. 33,06,779/- నిల్వ ఉంటాయి. ప్రావిడెంట్ ఫండ్ నుండి అవసరాలకు వాడుకొనే వెసులు బాటు ఉంటుంది. ప్రొపోర్షనేట్‌గా ఆ మేరకు నిల్వ తగ్గుతుంది. ఈ రొక్కము రిటైర్మెంట్ నాడు తిరిగి చెల్లిస్తారు.
ఈ ఫండ్స్‌ను ప్రభుత్వం నిర్వహించాలి. నిధులు తన కవసరము లేకుంటే పోస్టు ఆఫీసులో పెట్టవచ్చు. ఖాళీగా ఉంచకూడదు. క్రమం తప్పకుండా వడ్డీ జమ కావాలి. నూతన పెన్షన్ విధానంలో ప్రతి నెల ఉద్యోగి వేతనం, డిఎల నుండి 10 శాతాన్ని వాటాగా చెల్లించాలి. ప్రభుత్వం దానికి సమాన మొత్తం మ్యాచింగ్‌గా ఇస్తుంది. ఆ రొక్కాన్ని ఫండ్ మేనేజర్లకు పంపించాలి. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఎల్‌ఐసి,యుటిఐ వంటి సంస్థలు పెన్షన్ ఫండ్ మేనేజర్లుగా ఉన్నారు. వీరు ఆ పెన్షన్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ ఫండ్స్ ఈక్విటీలు, స్టాకు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు లేక నష్టాలు ఆర్జిస్తారు. రిటైర్మెంట్ నాటికి ఆర్జించిన లాభం లేదా నష్టం కలిసి ఉన్న నిల్వలో 60 శాతం నగదుగా చెల్లిస్తారు. ఆ చెల్లించే మొత్తం రూ. 10 లక్షలు దాటితే 20 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన 40 శాతం రొక్కము అమ్యూటిలలో పెట్టుబడిగా పెట్టి వచ్చిన రొక్కము పెన్షన్‌గా చెల్లిస్తారు. రిటైర్మెంట్ నాటికి రూ. 2 లక్షల కంటె తక్కువ మొత్తం ఖాతాలో నిల్వ వుంటే పూర్తిగా నగదుగా చెల్లిస్తారు. ఇంత తక్కువ మొత్తము కంట్రిబ్యూషన్ జమలు ఏ ఉద్యోగికి ఉండవు. కేవలం నష్టాల కారణంగా మాత్రమే రూ. 2 లక్షల కంటే తక్కువ నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుకే ఉద్యోగులకు ఈ స్కీము అంటే భయం. లాభాలు కూడా కొన్ని సందర్భాల్లో రావచ్చును. కాని పెన్షన్‌ను ఏక మొత్తం నగదు చెల్లింపు రూపంలో ఎంత వచ్చినా నిలబడదు. జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ లేకపోతే ఆ ఉద్యోగి జీవితం దుర్భరమవుతుంది. ఇది కొత్త విధానంలోని అతి పెద్ద మైనస్ పాయింట్. రెండు స్కీముల మధ్య తారతమ్యము చాలా ఉన్నది. పాత విధానంలో ఉద్యోగుల జీవితం చివరి దాకా పెన్షన్ అందిస్తుంది. కొత్త స్కీము జూద స్వభావము కలిగినది. లాభం రావచ్చును లేక నిండా మునగవచ్చును. జీవన భద్రతకు పనికి రాదు. పాత విధానంలో పెన్షన్‌ను నిధులు మొదటి నుండి చివరి దాకా ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. కేవలం పెన్షన్ చెల్లింపు వరకు మాత్రమే ఉద్యోగికి వాటిపై హక్కు ఉంటుంది. ఆ చెల్లింపుల తర్వాత ప్రభుత్వ నిధులలో కలుపుకోవచ్చును. ప్రభుత్వంపై ఎటువంటి భారము పడదు. దీనిని పెన్షన్ ట్రస్టుగా భావించవచ్చును. అసలు ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. లేక పెరుగుతుంది. కొత్త స్కీములో ప్రతి నెలా నిధులు ఫండ్ మేనేజర్లకు చేరుతాయి. ప్రభుత్వానికి ఏ అధికారం ఉండదు. దీర్ఘ కాంలో వేల కోట్ల రూపాయలు బయటకిపోతాయి. కనుక ఉభయులకు లాభదాయకమైన పాత పెన్షను విధానాన్ని రాష్ట్ర పెన్షన్ విధానంగా ప్రకటించి ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌ను తీర్చాలి. అందుబాటులోకి వచ్చే నిధులు ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఉన్నా రానురాను క్రమంగా పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకొని సక్రమంగా తిరిగి చెల్లింపులు చేయాలి. ప్రభుత్వంపై భారముండదు. ఉద్యోగులు సంతోషిస్తారు.

Comments

comments