ఐలయ్య పుస్తకంపై సుప్రీం సంచలన తీర్పు

న్యూఢిల్లీ: రిటైర్డ్ ప్రొ. కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ కులాన్ని కించపర్చేలా ఉన్న ఈ పుస్తకాన్ని వెంటనే బ్యాన్ చేయాలంటూ ఆర్యవైశ్య సంఘాల నేతలతో కలిసి ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం… పుస్తకాన్ని […]

న్యూఢిల్లీ: రిటైర్డ్ ప్రొ. కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ కులాన్ని కించపర్చేలా ఉన్న ఈ పుస్తకాన్ని వెంటనే బ్యాన్ చేయాలంటూ ఆర్యవైశ్య సంఘాల నేతలతో కలిసి ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం… పుస్తకాన్ని మేము నిషేధించలేమని, అలా చేస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లు అవుతుందన్నారు. కాగా, రచయితలు స్వీయనియంత్రణ పాటించాలేతప్ప, వివాదాస్పదం కారణంగా పుస్తకాన్ని రద్దు చేయాలని ఆదేశించలేమని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో పిటిష్నర్లకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇక కోర్టు తీర్పుపై స్పందించిన ఐలయ్య న్యాయస్థానం తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఒకరి భావప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని ఐలయ్య స్పష్టం చేశారు.

Comments

comments