కోరుకున్న కొలువు కొట్టాలంటే…

అభ్యర్థికి  ఉద్యోగావకాశాలు ఎక్కువగా  వస్తే  ఆ మజానే వేరు. అయితే  ఆప్షన్స్ ఎక్కువవడం కూడా ఒత్తిడికి దారితీస్తుంది. ఉద్యోగం విషయంలో తీసుకునే నిర్ణయం ఉద్యోగోన్నతికి ఉపయోగపడుతుందా, లేదా అనే ఆలోచనలు స్ట్రెస్‌ను కలిగిస్తాయి. ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉన్న మార్కెట్ అయితే కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం అభ్యర్థికి ఉంటుంది. ఇదివరకే ఉద్యోగం చేస్తూ,  కెరీర్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు కోరుకున్న రంగంలో ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా […]

అభ్యర్థికి  ఉద్యోగావకాశాలు ఎక్కువగా  వస్తే  ఆ మజానే వేరు. అయితే  ఆప్షన్స్ ఎక్కువవడం కూడా ఒత్తిడికి దారితీస్తుంది. ఉద్యోగం విషయంలో తీసుకునే నిర్ణయం ఉద్యోగోన్నతికి ఉపయోగపడుతుందా, లేదా అనే ఆలోచనలు స్ట్రెస్‌ను కలిగిస్తాయి. ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉన్న మార్కెట్ అయితే కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం అభ్యర్థికి ఉంటుంది. ఇదివరకే ఉద్యోగం చేస్తూ,  కెరీర్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు కోరుకున్న రంగంలో ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అభ్యర్థులు మరో ఉద్యోగం పొందడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్కిల్ ఉన్న అభ్యర్థులకు ఏ కంపెనీ అయినా రెడ్ కార్పెట్ వెల్‌కం చెప్పేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అభ్యర్థికి నచ్చిన ఉద్యోగాన్ని కోరుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరెంచుకుంటున్న ఉద్యోగం కెరీర్ ఎదుగుదలకు అవరోధంగా ఉంటే దాన్ని వదులుకోవడం ఉత్తమం. మీ వ్యక్తిగత, కెరీర్ గోల్స్‌ను చేరుకునే వీలున్న ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు.  కెరీర్ ఎదుగుదలకు  ఉపయోగపడే ఉద్యోగాన్ని(మొదటిదైనా సరే) పొందేందుకు కాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు. అలా కాకుండా ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చినప్పుడు వాటిని ఆప్టిమైజ్ చేసుకుని నిర్ణయం తీసుకోవడం అవసరం. నిర్ణయం తీసుకునే ముందు వీటిని పరిశీలించడం అవసరం… 

ఎన్ని అవకాశాలు వచ్చినా మరో అవకాశం కోసం ఎల్లప్పుడూ ఉద్యోగాన్వేషణ చేస్తూనే ఉండాలి. అంటే అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగాన్వేషణకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూండాలి. ముఖ్యంగా మీ ‘లింక్‌డిన్’ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం మరవొద్దు. ఇదివరకే ఉద్యోగం చేస్తూంటే, దాన్లో సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు డాక్యుమెంటేషన్ చేసి రెజ్యూమేలో జత చేయడం అవసరం. మీ లోని నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు సంస్థలే మీ దగ్గరికి వస్తాయి కాబట్టి వారిచ్చిన అవకాశానికి రెస్పాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలి.

ఉద్యోగానికి సరిపడే ప్రొఫైల్ : దీని వల్ల మీరు కోరుకునే అవకాశాలు రావడంతో పాటు అవసరం లేవనుకున్నవి వద్దనకుండానే దూరమవుతాయి. అలాగే ప్రస్తుతం మీరు చేస్తున్న, ఇదివరకు చేసిన ఉద్యోగంలో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన అంశాలను కింద రాయడం మరవొద్దు.
ఇది రాసే ముందు మీకు మీరు వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు – వృత్తిలో ఏ రకమైన ఆక్టివిటీస్ మీకు తృప్తినిస్తున్నాయి? చేయాలనుకుంటున్న ఉద్యోగంలో ఏ విషయాలను దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? వృత్తిని జీవితాన్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం చేయాలనుకుంటున్న కంపెనీ కల్చర్ ఎలా ఉండాలనుకుంటున్నారు?

ఉద్యోగంలో మీరు ఇష్టపడే అంశం ఏది? ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీరు మిస్సవుతున్నది, చేరబోయే ఉద్యోగంలో కోరుకునేదేంటో కూడా పరిశీలించుకోవాలి. ఉదాహరణకు మీకు ఈవెంట్స్ ప్లాన్ చేయడం ఇష్టమైతే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆ అవకాశం మీకు ఉందా అనేది పరిశీలించుకోవాలి. లేదంటే మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీకు సరిపడ అవకాశాలు రానట్లే, లేదా మీ ఆలోచనలపై బాస్ అజమాయిషీ ఉందనేది స్పష్టం. ఇది మీ ఉద్యోగోన్నతికి అడ్డుపడే అంశమే అవుతుంది.

సరిపడే ఉద్యోగాన్ని పరిశీలించండి : ఆన్‌లైన్ కెరీర్ అసెస్‌మెంట్ల సహాయం తీసుకోవడం మంచిది. దీని వల్ల కోరుకునే ఉద్యోగం పొందడానికి కావల్సిన వ్యాల్యూస్, ఇంట్రెస్ట్‌లు, వ్యక్తిగత అంశాలను వెల్లడించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి, దాంతో ఉద్యోగం పొందడం తేలికవుతుంది. ఐడియల్ కెరీర్‌ను నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటే కెరీర్ కౌన్సిలర్ సాయం తీసుకోవడం ఉపయోగపడుతుంది. ఫలానా కంపెనీలోనే ఉద్యోగం చేయాలనే కోరిక ఉన్నట్లయితే ఆ కంపెనీ హెడ్స్‌తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం మొదలుపెట్టాలి.

మీ విలువ మీరు తెలుసుకోవాలి : మీ నైపుణ్యాలు మిమ్మల్ని డిమాండ్‌లో నిలబెట్టాయంటే మీ రాబడిని పెంచుకునే అవకాశం పొందినట్లే. మీ నైపుణ్యాలకు తగ్గ జీతం గూర్చి తెలుసుకునేందుకు ఆన్‌లైన్ సాలరీ సోర్సెస్‌లో వెదకడం ప్రయోజనకరమవుతుంది. లేదా తోటి ప్రొఫెషనల్స్ నుంచి సమాచారం సేకరించడం, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్‌లో కనుక్కోవడం కూడా ఉపయోగపడుతుంది.

ఎక్కువ జీతం కావాలా? : మీరు పని ఎక్కువ చేస్తున్నట్లయితే ఎక్కువ జీతం అడగడానికి, ఎక్కువ జీతం పొందే అవకాశం ఉన్న ఉద్యోగం అడగడానికి మొహమాట పడొద్దు. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులకు వేరే కంపెనీల్లో ఉన్నత జీతంతో ఉద్యోగాలిచ్చే వెసులుబాటు ఉంటుంది. ఒక్కోసారి ఉద్యోగం మారడమే జీతంలో పెరుగుదలకు కారణమవుతుంది. అయితే మీరు చేసే ఉద్యోగాన్ని వదలకూడదనుకుంటే మాత్రం ప్రస్తుతం చేసే సంస్థకు అల్టిమేటం ఇవ్వకూడదు. ఇంకో ఉద్యోగం లేనప్పుడు ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవడం సరైన నిర్ణయం కాదు.

నైపుణ్యాలను పెంచుకోవాలి : కొత్త కొలువు కోరుకుంటున్నప్పుడు దానికి సరిపడా నైపుణ్యాలను పెంచుకోవడం అవసరం. లేదా ప్రస్తుతం ఉన్న సర్కిల్ నుంచి బయటకు వచ్చి పని పరిథిని పెంచుకోవడం కూడా ఉపయోగపడుతుంది. స్థాయిని పెంచుకునేందుకు మరిన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధపడాలి. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోయినా కూడా మీ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవడం అవసరమే, ఇది ఇంకో సంస్థలోకి మారడానికి లేదా చేస్తున్న సంస్థలోనే జీతం పెరగడానికి దోహదమవుతుంది.

రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించండి : పనిచేసేవారి సంఖ్య తగ్గినప్పుడు కొత్త సంస్థలు ఉద్యోగులను నియమించేందుకు రిక్రూటర్స్‌ను ఆశ్రయిస్తుంది. ఈ రిక్రూటర్లు మీ ప్రొఫైల్స్‌ను లింక్‌డిన్ లాంటి సోషల్ ప్లాట్‌ఫార్మ్ నుంచి తీసుకుంటాయి. కాబట్టి వాటిలో మీ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. మీరు కోరుకునే ఉద్యోగంలో మిమ్మల్ని ప్రమోట్ చేసేలా చేసుకోవడం కూడా అవసరమే కాని మీ లక్ష్యాలను రీ డిఫైన్ చేసి వారి ప్రమోషన్‌కు ఉపయోగించుకునే హక్కు వారికివ్వకూడదు. లింక్‌డిన్ ప్రొఫైల్ అప్‌డేట్ చేయడం వల్ల మీరు కోరుకునే ఉద్యోగం మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తుంది.

నో థాంక్స్ చెప్పడానికి వెనుకాడొద్దు : కోరుకున్న ఉద్యోగం కాకుండా వేరేది వస్తే ‘నో’ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు మంచి డిమాండ్‌లో ఉంటే వేరే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వచ్చిన అవకాశం ఉన్నతంగా ఉంటే తప్ప ప్రస్తుత ఉద్యోగాన్ని వదలకూడదు. అలాగని అత్యున్నత ఉద్యోగాన్ని పొందేందుకు రెజ్యూమ్ తయారుచేస్తే అది మీ కెరీర్‌కు రెడ్ సిగ్నల్ అవుతుందన్నది మరువకూడదు. ఇలాంటి రెజ్యూమెలు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రిజెక్ట్ అవుతాయి.

సంబంధాలను వాడుకోవాలి : సమాచారం, ఉద్యోగంలో ఉన్నతి పొందేందుకు మీకున్న సామాజిక సంబంధాలను వాడుకోవాలి. వారి సూచనలు, సలహాలు పాటించాలి. మీరు కోరుకున్న ఉద్యోగానికి ప్రొఫైల్ పంపి రెకమండేషన్ చేయాల్సిందిగా తెలిసినవారిని కోరడం తప్పుకాదు. ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, పనిచేయించుకునేందుకు సంస్థ బోనస్ చెల్లిస్తుంది, ఈ సమయంలో అక్కడ ఉన్న స్టాఫ్, ఉద్యోగుల రెకమండేషన్ పనిచేస్తుంది.

ఏ ఉద్యోగాన్ని పొందాలో నిర్ణయించడం : ఎక్కువ ఉద్యోగావకాశాలున్నప్పుడు నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. ఆ సమయంలో ఒక్కో ఉద్యోగం వల్ల వచ్చే లాభం, ఎంప్లాయీ బెనిఫిట్ ప్యాకేజెస్ లాంటి వాటిని బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. అయితే అన్ని సందర్భాల్లో డబ్బే ప్రధానం కాదు, ఉద్యోగం వల్ల పొందే లాభాలు, ఉన్నతావకాశాలను కూడా కలపుకోవడం అవసరం. అవసరమైతే కొన్నింటి విషయంలో బేరం కూడా చేయొచ్చు. బయ్యర్స్ మార్కెట్‌లో ఉండి ఉద్యోగాన్వేషణ చేస్తున్నప్పుడు మీరు డ్రైవర్ సీట్లో ఉన్నట్టే, అందుకే కావల్సిందాన్ని కోరుకునే అవకాశం మీకే ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో చేరుతున్నప్పుడు మిగిలినవన్నీ మర్చిపోయి పనిచేయడం అవసరం.

Related Stories: