తండ్రికి అండగా అక్షర

విలక్షణ కథానాయకుడు కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓ కొత్త పార్టీని ఏర్పాటుచేసి రాజకీయాల్లోనూ సత్తా చాటాలను కుంటున్నాడు. అయితే తన తండ్రి కమల్‌కు వెనుక ఉండి సహాయం చేస్తోంది ఆయన చిన్న కూతురు అక్షరహాసన్. అనేక రకాల అంశాలపై తండ్రికి సలహాలు, సూచనలు ఇస్తోందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియా ప్రచారంలో  కమల్‌హాసన్‌కు అక్షర ఎంతగానో తోడ్పడు తోందట. అక్షరహాసన్‌కు సామాజిక అంశాలపై పట్టు ఎక్కువ. ప్రస్తుతం ఆమె రాజకీయంగా తండ్రికి అండగా నిలవాలని […]

విలక్షణ కథానాయకుడు కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓ కొత్త పార్టీని ఏర్పాటుచేసి రాజకీయాల్లోనూ సత్తా చాటాలను కుంటున్నాడు. అయితే తన తండ్రి కమల్‌కు వెనుక ఉండి సహాయం చేస్తోంది ఆయన చిన్న కూతురు అక్షరహాసన్. అనేక రకాల అంశాలపై తండ్రికి సలహాలు, సూచనలు ఇస్తోందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియా ప్రచారంలో  కమల్‌హాసన్‌కు అక్షర ఎంతగానో తోడ్పడు తోందట. అక్షరహాసన్‌కు సామాజిక అంశాలపై పట్టు ఎక్కువ. ప్రస్తుతం ఆమె రాజకీయంగా తండ్రికి అండగా నిలవాలని నిర్ణయించుకుంది. కమల్ పెద్ద కూతురు శృతిహాసన్ తండ్రికి వారసురాలిగా సినిమాల్లో రాణిస్తోంది. అదే సమయంలో అక్షరహాసన్ తండ్రికి రాజకీయాల్లో సహాయకారిగా ఉండాలనుకుంటోంది.