పత్తి.. మెడపై కత్తి

కూలీలు దొరక్క, మార్కెట్‌పై భరోసా లేక రైతు ఆందోళన  ప్రపంచవ్యాప్తంగా 9శాతం పెరిగిన సాగు పోటీ భారీగా పెరిగే సూచన ప్రభుత్వాలు ముందుగానే కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు తీసుకోవాలని రైతుల డిమాండ్ హైదరాబాద్: పత్తి కొనుగోలునకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోకపోతే ధర పతనం తప్పేలా లేదు. మన రాష్ట్రం లో ఈసారి రికార్డు స్థాయిలో 47.17 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి పంటతో భారీ ఉత్పత్తి రానుందని ప్రభు త్వం అంచనా వేస్తోంది. అయితే […]

కూలీలు దొరక్క, మార్కెట్‌పై భరోసా లేక రైతు ఆందోళన

 ప్రపంచవ్యాప్తంగా 9శాతం పెరిగిన సాగు

పోటీ భారీగా పెరిగే సూచన

ప్రభుత్వాలు ముందుగానే కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు తీసుకోవాలని రైతుల డిమాండ్

హైదరాబాద్: పత్తి కొనుగోలునకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోకపోతే ధర పతనం తప్పేలా లేదు. మన రాష్ట్రం లో ఈసారి రికార్డు స్థాయిలో 47.17 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి పంటతో భారీ ఉత్పత్తి రానుందని ప్రభు త్వం అంచనా వేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో రానున్న పత్తి ఉత్పత్తులు మన దేశ పత్తి రంగాన్ని సవాల్ చేయనున్నాయని మార్కెట్ వర్గా లు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విస్తీర్ణం లో సాగైన పత్తి పంటతో అధిక దిగుబడులు రానున్నా యి. దీంతో అంచనాలను మించి పత్తి సరఫరాను ప్ర పంచ మార్కెట్ ఎదర్కొనుంది. దీని ఫలితమే పోటీ తత్వంతో ఎగుమతి అవకాశాలు పరిమితం కానున్న ట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే సెప్టెంబ ర్ తరువాత చైనా పత్తిని డి స్టాక్ చేస్తుందా లేదా అన్న ది కూడా తెలియడం లేదు. ఇది దేశ పత్తి మార్కెట్‌ను తీవ్ర ప్రభావితం చేయనుంది. ఈ క్రమంలో ప్రభుత్వా లే ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, మద్దతు ధరకు పత్తిని సేకరించాలి. లేదంటే పత్తి రైతు కుదేలు గాక తప్పదని హెచ్చరిస్తున్నారు. గత ఏడాది మన రా ష్ట్రంలో క్వింటా పత్తి రూ. 6000 వరకు ధర పలికింది. రైతులు లాభాలు పొందారు. ఈసారి కూడా అధిక ధ ర ఉంటుందని ఆశించి అధిక విస్తీర్ణంలో పత్తి పంటను వేశారు. అయితే ఉత్పత్తి అధికంగా రానుండటంతో పత్తి ధరపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటా మద్దతు ధర రూ. 4320 ప్రకటించింది. పత్తి సాగుకు ఒక హెక్టరుకు రూ. 1,12,152 ఖర్చు అవు తోంది. పత్తి సాగులో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర ముందుస్థానంలో ఉండ గా, రెండో స్థానంలో గుజరాత్ ఉంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో పత్తి రోజుకు 15002000 బేల్స్ మార్కెట్‌లోకి వస్తుంది. అధిక తేమ కలిగిన పత్తి క్వింటా ధర రూ. 3800 నుంచి రూ.4955 మధ్య ఉన్నట్లు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈసారి 7.63 కోట్ల ఎకరాలలో (31.9 మిలియన్ల హెక్టర్లు) పత్తి పంట సాగైంది. 9 శాతం సాగు పెరిగింది. మొత్తంగా 2.50 కోట్ల టన్నుల దిగుబడి రానున్నట్లు అంచనా. ఇందులో పత్తిని అధికంగా సాగు చేస్తుంది మన దేశమే. ఈ వానకాలంలో ఏకంగా 3.20 కోట్ల ఎకరాలలో పత్తిని వేసారు. 65 లక్షల టన్నులు దిగుబడి రానున్నట్లు అంచనా. గతంతో చూస్తే 4 శాతం పెరుగుతుంది. చైనాలో 50.20 లక్షల టన్నులు, పాకిస్తాన్‌లో 20 లక్షల టన్నులుగా దిగుబడి రానున్నట్లు అంచనా. అమెరికా దేశాల్లో 40.50 లక్షల టన్నులు రానుందని జయశంకర్ వర్సిటీ అంచనా వేసింది.
కొనుగోలు కేంద్రాలపై రాష్ట్రం ముందస్తు ప్రణాళిక : పత్తి ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం ముందస్తు చర్యలు ప్రారంభించింది. సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద దళారీ వ్యవస్థను నివారించేందుకు పత్తి రైతులకు క్యూర్ కోడ్ కలిగిన ఐడి కార్డులను ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఈ సమాచారాన్నే మార్కెటింగ్ అధికారులు రైతు ఐడి కార్డులోని క్యూఆర్‌ను స్కాన్ చేసి నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకి అమ్మిన పత్తికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. ఈసారి 143 సిసిఐ కొనుగోలు కేంద్రాలు పనిచేయనున్నాయి.
పత్తి రైతుకు కూలీల బెంగ : పత్తికి పూత పూసింది… కాతకొస్తోంది మందు పెట్టేందుకు మనుషులు దొరకతలేరు… వరి నాట్లు పడ్డాయి… పైరు ఎదుగుతోంది.. పెరుగుతున్న కలుపు తీపిద్దామంటే కూలీలు దొరకరాయే.. ఎవరైనా వస్తామన్నా రూ. 300 నుంచి రూ. 400 వరకు ఇచ్చుకోవాల్సి వస్తోంది. మరో నెలలో చేతికి రానున్న పత్తికి అన్నదాతకు ఇప్పటి నుంచే కూలీల బెంగ పట్టుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఒక హెక్టారు పత్తి సాగుకు కూలీల ఖర్చు రూ. 48729. పెట్టుబడి వ్యయం కంటే అధికంగా ఖర్చు అవుతోంది కూడా కూలీలకేనని అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి)కు 2017 వానకాలం సాగుకు సంబంధించి అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలు నివేదించాయి. ఇదే వాస్తవం కూడా. పత్తి పంటకు ఎరువు మందు పెట్టేందుకే కూలీలు దొరకడం లేదు. రేపు పత్తి తీసే సమయానికి మరింతగా కూలీల సమస్య తీవ్రమవుతుందని అన్నదాతలు చెబుతున్నారు. వరి కోసేందుకు కోత మిషన్‌లు… విత్తనాలు వేసేందుకు యంత్రాలు, దున్నడానికి ట్రాక్టర్లు వచ్చాయి. అయితే పూసిన పత్తిని తీసేందుకు సరైన యంత్ర పరికరం అందుబాటులోకి మాత్రం రాలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పెద్ద రైతులు పదుల కిలో మీటర్లు దాటి అధిక మొత్తం చెల్లించి మరి కూలీలను తెచ్చుకుంటున్నారు. వేరే ఊర్లలో పనికి వెళితే మన ఊర్లో ఎవరూ చేస్తారని కొన్ని గ్రామాలలో తీర్మానాలు చేసి ఎక్కడి వారే అక్కడే కూలీకి పోవాలనే నిబంధన తెచ్చుకుంటున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా సాంకేతికత అందుబాటులోకి రాకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు కూడా పేర్కొనడం గమనార్హం. వ్యవసాయ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, పెళ్లి చేసుకునే సమయంలోనే స్త్రీలు ఆ పని మేము చేయమనే కండిషన్ కూడా పెడుతున్నారని ఒక రైతు వాపోయారు. పాఠశాలలకు ఏమైనా సెలవులు వస్తే విద్యార్థులను బతిలాడుకుని కూలీలుగా తీసుకురావాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
గ్రామంలో తీర్మానం చేసాం : బీదన లింగమూర్తి, యాదాద్రి భువనగిరి
4 ఎకరాలలో పత్తి సాగు చేసా. దున్నకం నుంచే కూలీల సమస్య ఉంది. వ్యవసాయ పని అంటే ఎవరు ముందుకొస్తలేరు. వచ్చేటోళ్లేమో ఎక్కువ అడుగుతున్నారు. వేరే ఊర్ల వాళ్లు అసాములు ఎక్కువ కూలీ చెల్లించి తీసుకుపోతున్నారు. ఇట్ల కాదని ఊర్లో తీర్మానం చేసినం. మన ఊరోళ్లు మన పొలాల దగ్గరనే పనికి పోవాలని. అయినా పత్తి తీసేసరికి ఇంకా ఎక్కువ మంది అవసరమైతరు. కూలీలకే ఎక్కువ పెట్టాల్సి వస్తోంది. వరి కోత మిషన్‌లా పత్తికి మిషన్ ఉంటే మంచిగుంటది.

Related Stories: