అక్కినేని నాగార్జున, సమంత, సీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్లపై ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాజుగారి గది-2’. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “నాన్నగారు మన మధ్య లేరు అనడం తప్పు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. అబ్బూరి రవి మాటలు, దివాకరన్ సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ కంటే ముందుగా మరో ట్రైలర్‌ను చూశాను కానీ నచ్చలేదు. దాంతో దర్శకుడు ఓంకార్ ఒక రోజు సమయం తీసుకొని మంచి ట్రైలర్ తయారు చేశాడు. ఇందులో సినిమా అంతటా కనిపించే క్యారెక్టర్ చేశాను. మెంటలిస్ట్ పాత్రలో కనపడతాను. కేరళలోని ఓ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. అశ్విన్, షకలక శంకర్, వెన్నెల కిషోర్ల కామెడీ ట్రాక్ సూపర్బ్. ఇందులో సమంత, సీరత్కపూర్లలో ఎవరు దెయ్యంగా చేశారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పివిపి దేనికీ వెనుకాడకుండా భారీగా ఖర్చు పెట్టి ఈ సినిమా పూర్తిచేశారు. అక్టోబర్ 13న సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను”అని అన్నారు. ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ “అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజున ‘రాజుగారి గది 2’ ట్రైలర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. నాగార్జునతో మా బ్యానర్లో ‘ఊపిరి’ సినిమా చేశాం. అంతకంటే కమర్షియల్‌గా పెద్ద సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను ప్లాన్ చేశాం”అని తెలిపారు. దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ “నాగార్జున కథ విన్న ఐదు నిమిషాల్లోనే ఈ సినిమా చేస్తున్నానని అన్నారు. నేను నాగార్జున అభిమానిని. దర్శకుడిగాకంటే ఓ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ‘శివ’లోని చైన్ సీన్‌ను ఆధారంగా చేసుకొని రుద్రాక్ష సీన్‌ను డిజైన్ చేశాను”అని తెలిపారు. తమన్ మాట్లాడుతూ “ఓంకార్ తెరకెక్కించిన విజువల్స్ చూసిన తర్వాతే నేను ఇంత మంచి మ్యూజిక్ చేయగలిగాను. సమంత ఇందులో హార్ట్ టచింగ్ రోల్ చేశారు. ఖచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది”అని పేర్కొన్నారు.
‘శివ’ చైన్ సీన్ ఆధారంగా రుద్రాక్ష సీన్
అక్కినేని నాగార్జున, సమంత, సీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్లపై ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాజుగారి గది-2’. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “నాన్నగారు మన మధ్య లేరు అనడం తప్పు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. అబ్బూరి రవి మాటలు, దివాకరన్ సినిమాటోగ్రఫీ, […]