లక్షకు పైగా డైరెక్టర్లపై అనర్హత వేటు

న్యూఢిల్లీ : షెల్ కంపెనీలకు(బోగస్) చెందిన 1,06,578 మంది డైరెక్టర్లపై అనర్హత వేటు పడింది. ఈమేరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా షెల్ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ చర్యల్లో భాగంగా డైరెక్టర్లను గుర్తించడానికి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వద్ద ఉన్న షెల్ కంపెనీల గణాంకాలను మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. ఇటీవలే 2.09 లక్షల కంపెనీలపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆయా […]

న్యూఢిల్లీ : షెల్ కంపెనీలకు(బోగస్) చెందిన 1,06,578 మంది డైరెక్టర్లపై అనర్హత వేటు పడింది. ఈమేరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా షెల్ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ చర్యల్లో భాగంగా డైరెక్టర్లను గుర్తించడానికి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వద్ద ఉన్న షెల్ కంపెనీల గణాంకాలను మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. ఇటీవలే 2.09 లక్షల కంపెనీలపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఆయా సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా నిర్భందించింది. ఇప్పుడు 1,06,578 మంది డైరెక్టర్లను అనర్హులుగా గుర్తించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కంపెనీల్లో డైరెక్టర్ ఎలాంటి ఆర్థిక ప్రకటనను లేదా వార్షిక రిటర్నులను మూడేళ్ల వరకు దాఖలు చేయడానికి వీలులేదు. అలాగే ఇతర సంస్థకు వీరు ఐదేళ్ల వరకు పునఃనియామకానికి అర్హులు కారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కంపెనీలపై నిఘా ఉంచామని, ఈ సంస్థలు మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినాయని ప్రభుత్వం వెల్లడించింది. డైరెక్టర్ల గతచరిత్ర, ఆ కంపెనీల్లో వారి పనితీరు వంటి అన్నింటిన్నీ ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ఈ డిఫాల్టింగ్ కంపెనీల ప్రొఫెషనల్స్‌ను, చార్టెడ్ అకౌంటెంట్లను, కంపెనీ సెక్రటరీలను, కాస్ట్ అకౌంటెంట్లను మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీరిపై కూడా మంత్రిత్వ శాఖ నిఘా ఉంచింది.
రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు గాను ఆర్‌ఒసి(రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్) నుంచి 2 లక్షలకు పైగా కంపెనీల పేర్లను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. సదరు కంపెనీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వాటి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. ప్రస్తుతం డీరిజిస్టర్ అయిన కంపెనీల డైరెక్టర్లు సదరు బ్యాంకు ఖాతాలను వినియోగించకుండా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. 3 లక్షల రిజిస్టర్డ్ కంపెనీల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, 1 లక్షల కంపెనీలను ఈ జాబితా నుంచి తొలగించామని ఇటీవల ఆర్ఠిక మంత్రిత్వశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 37 వేలకు పైగా కంపెనీలు డొల్ల సంస్థలని గుర్తించింది. వీటి ద్వారా నల్లధనం, హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. అనుమానిత డొల్ల కంపెనీల్లో ట్రేడింగ్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. దాదాపు 331 డొల్ల కంపెనీల్లో(నల్లధనం, పన్నుల ఎగవేత కోసం ఏర్పాటు చేసేవి) ట్రేడింగ్‌ను నిలుపుదల చేయాలని స్టాక్ ఎక్సేంజ్‌లను ఆదేశించిన విషయం తెలిసిందే.

Comments

comments

Related Stories: